మహారాష్ట్ర చక్కెర రైతుల పేరిట బ్యాంకు నుంచి పొందిన వ్యవసాయ రుణాలను కంపెనీ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.255 కోట్ల విలువున్న ఆస్తులను జప్తుచేసింది. ఈ మేరకు ఈడీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పర్భాణీ జిల్లాలోని గంగాఖేద్ షుగర్, ఎనర్జీ లిమిటెడ్(జీఎస్‌ఈఎల్), యోగేశ్వరి హ్యాచరీస్, గంగాఖేద్ సోలార్ పవర్ లిమిటెడ్‌లకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఇలా మోసం..
పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతుల వివరాలను(కేవైసీతో సహా) చక్కెర కర్మాగారం జీఎస్‌ఈఎల్ సేకరించింది. రైతుల తరఫున బ్యాంకుకు ఏజెంటుగా వ్యవహరించేందుకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నందున.. కర్షకుల కేవైసీలను ఉపయోగించి, బ్యాంకులో రుణాలకు దరఖాస్తు చేసింది. ఇలా 2012-13 నుంచి 2016-17 దాకా మంజూరైన రూ.772 కోట్లను సొంత ప్రయోజనాలకు యాజమాన్యం వాడుకుంది. దీనిపై గతేడాది మే నెలలో నగదు అక్రమ చలామణి కింద జీఎస్‌ఈఎల్‌తో పాటు, కంపెనీ ప్రమోటర్ రత్నాకర్ గుట్టెలపై కేసు నమోదయింది.
ఇదీ చూడండి : రూ. 500 నోట్ల కట్ట లాక్కొని చుక్కలు చూపిన కోతి!