అధికారులకు, సిబ్బందికి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం గురువారం ప్రారంభించింది. దిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎంఎస్ గిల్ తొలి టీకా తీసుకున్నారు. సిబ్బందికి టీకా పంపిణీ పూర్తయ్యాకే ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునిల్ అరోడా సహా ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్రా, రాజీవ్ కుమార్లు వ్యాక్సిన్ తీసుకుంటారని ఈసీ పేర్కొంది.
ఫోటో ఓటర్ స్లిప్..
తమిళనాడు ఎన్నికల్లో ఫొటో ఓటర్ పత్రం స్థానంలో ఓటర్ సమాచారం పత్రం ప్రవేశపెట్టేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహూ గురువారం వెల్లడించారు. ఓటరు సమాచార పత్రంలో పోలింగ్ కేంద్రం, తేదీ, సమయం మొదలైన వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉన్న అందరికీ ఈ పత్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు.
సమావేశం..
ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమితులైన ప్రత్యేక అధికారులతో ఈసీ సమావేశమైంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ అధికారులు పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
ఇదీ చదవండి : మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం!