ETV Bharat / bharat

ఆ జిల్లాలో నేతల పర్యటనపై నిషేధం - west bengal violence news

బంగాల్ కూచ్​ బిహార్​ జిల్లాలో రాజకీయ నాయకులు 72 గంటల పాటు పర్యటించకుండా నిషేధం విధించింది ఎన్నికల సంఘం. శనివారం నాలుగో విడత పోలింగ్​లో హింసాత్మక ఘటనలు చెలరేగి అయిదుగురు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

EC bans entry of political leaders in Cooh Behar for 72 hours following poll violence
ఆ జిల్లాలో నేతల పర్యటనపై నిషేధం
author img

By

Published : Apr 11, 2021, 5:31 AM IST

బంగాల్‌లోని కూచ్​ ‌బిహార్‌ జిల్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగడం వల్ల ఎన్నికల సంఘం పలు ఆంక్షలు విధించింది. మూడు రోజుల పాటు ఆ జిల్లా సరిహద్దుల్లో నేతల పర్యటనలు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్​బిహార్‌ జిల్లాలో కేంద్ర భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మృతిచెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ నెల 17న ఐదో దశ ఎన్నికలకు సైలెంట్‌ పీరియడ్‌ను 72గంటలకు పొడిగించింది.

ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్‌కు 72గంటల ముందు నేతలెవరూ ప్రచారం నిర్వహించకుండా నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ పేర్కొంది. కాల్పులు చోటుచేసుకున్న ఘటనా స్థలాన్ని సీఎం మమతా బెనర్జీ ఆదివారం రోజున కోచ్‌బిహార్‌లో పర్యటించనున్నట్టు ప్రకటించారు.

ఇదీ చూడండి: కూచ్​బిహార్​ కాల్పులే ప్రచారాస్త్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.