ETV Bharat / bharat

టీకా ధ్రువపత్రాలపై మోదీ ఫొటో తొలగించండి: ఈసీ - కరోనా టీకా రాజకీయాలు

కరోనా టీకా ధ్రువపత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ టీఎంసీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై ఈసీ స్పందించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో టీకాల పంపిణీలో ప్రధాని ఫొటోలు ఉపయోగించొద్దని ఆదేశించింది.

ec-asks-health-ministry-to-follow-poll-code-provisions-in-lette
టీకా ధ్రువపత్రాలపై మోదీ ఫొటో తొలగించండి
author img

By

Published : Mar 6, 2021, 11:03 AM IST

ఎన్నికల వేళ కరోనా వ్యాక్సిన్‌ ధ్రువీకరణ పత్రాలపై మోదీ చిత్రం ఉండటాన్ని తప్పుబడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్నికల కోడ్‌ నిబంధనలను పాటించాలని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో టీకా ధ్రువపత్రాలపై ప్రధాని ఫొటోను తొలగించాలని ఈసీ కేంద్రాన్ని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖకు ఈసీ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

టీఎంసీ అభ్యంతరం..

టీకా ధ్రువపత్రాలపై మోదీ చిత్రం ఉంచడాన్ని తప్పుపడుతూ.. తృణమూల్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దానిలో ఆరోపించారు. ఈ ఎన్నికల సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మోదీ అనవసర ప్రచారం చేసుకోకుండా చూడాలంటూ తన ఫిర్యాదులో ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ఈసీ.. తాజాగా కేంద్రానికి లేఖ రాసింది.

మరికొంత సమయం పట్టొచ్చు..

ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కరోనా టీకా ధ్రువపత్రాలపై మోదీ చిత్రాలను వెంటనే తొలగించాలని ఈసీ అందులో పేర్కొంది. అయితే ఇతర రాష్ట్రాల్లో యథావిధిగా ప్రధాని చిత్రాన్ని కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల కోడ్‌ విధి విధానాలను, నిబంధనలను కేంద్ర ఆరోగ్యశాఖ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అయితే టీకా ధ్రువపత్రాలపై మోదీ చిత్రం రాకుండా ఉండాలంటే సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ఫిల్టర్లు ఉపయోగించాల్సి ఉంటుందని, దానికోసం కొంత సమయం పట్టొచ్చని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

పశ్చిమబెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు పలు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 26న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

ఇవీ చదవండి: తృణమూల్​ ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషన్​

మమత స్థానచలనం వెనక మతలబేంటి?

బంగాల్​లో అంతర్గత కుమ్ములాటల ఉచ్చులో భాజపా!

నందిగ్రామ్​ నుంచే దీదీ సై.. మరి సువేందు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.