ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో భూకంపం.. రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత - జమ్ముకశ్మీర్​లో భూకంపం

Earthquake: జమ్ముకశ్మీర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. పాకిస్థాన్​లోనూ 5.6 తీవ్రతతో భూమి కంపించింది.

Earthquake
భూకంపం
author img

By

Published : Jan 15, 2022, 5:22 AM IST

Earthquake: జమ్ముకశ్మీర్​ ప్రజలు ఒక్కక్షణం ఉలిక్కిపడ్డారు. శుక్రవారం రాత్రి కశ్మీర్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. అఫ్గానిస్థాన్​లోని హిందుకుశ్​ ​సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జమ్ముకశ్మీర్​లోనూ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

పాకిస్థాన్​లోనూ..

ఉత్తర పాకిస్థాన్​లో 5.6 తీవ్రతతో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. అఫ్గానిస్థాన్​-తజికిస్థాన్​ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఖైబర్​ పఖ్తుంక్వా, పెషావర్​ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: Earthquake: కశ్మీర్​లో భూకంపం- వణికిపోయిన పాక్​ ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.