బంగాల్ బీర్భుమ్ జిల్లాలో రెండు టీఎంసీ వర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. గారా పదుమ గ్రామంలో బాంబులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణల్లో తుపాకీలు కూడా వినియోగించారు.
ఓ ప్రభుత్వ ఇళ్ల పథకం సర్వే కోసం బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ బృందం.. గ్రామాన్ని సందర్శించిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై టీఎంసీ స్పందించింది. వ్యక్తిగత విషయాలతో ఘర్షణ చెలరేగిందని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఘటనకు బాధ్యులైనవారిపై తగిన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించింది.
అయితే.. ఈ రెండు వర్గాలు వివిధ అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నాయని భాజపా ఎమ్మెల్యే అనుప్ సాహా ఆరోపించారు.
ఇదీ చదవండి:బ్లేడ్‌తో విద్యార్థిని గొంతు కోసి.. ఆస్పత్రి వరకు వెంబడించి..
live murder video viral: వ్యాపారి దారుణ హత్య.. తుపాకులతో ఒక్కసారిగా..