ETV Bharat / bharat

న్యూ ఇయర్ వేడుకల్లో పాము కాటుతో వ్యక్తి మృతి.. 'స్పెషల్​ గిఫ్ట్'​ అంటూ అరవడం వల్లే! - న్యూ ఇయర్ వేడుకలలో పాముకాటుతో వ్యక్తి మృతి న్యూస్

నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం సేవించిన ఓ వ్యక్తి.. హల్​చల్​ చేశాడు. అటుగా వెళ్తున్న ఓ పామును పట్టుకుని న్యూఇయర్​ గిఫ్ట్​ అంటూ అరిచాడు. రెప్పపాటులో ఆ సర్పం అతడిని కాటువేయగా.. మృతి చెందాడు. తమిళనాడులో జరిగిందీ ఘటన.

person died to snake bite in tamil nadu
న్యూ ఇయర్ వేడుకలలో పాముకాటుతో వ్యక్తి మృతి
author img

By

Published : Jan 2, 2023, 3:46 PM IST

Updated : Jan 2, 2023, 4:33 PM IST

న్యూ ఇయర్ వేడుకల్లో పాము కాటుతో వ్యక్తి మృతి.. 'స్పెషల్​ గిఫ్ట్'​ అంటూ అరవడం వల్లే!

తమిళనాడులో కడలూరు జిల్లాలో విషాదం నెలకొంది. డిసెంబరు 31న రాత్రి నూతన సంవత్సరం వేడుకల్లో ఓ వ్యక్తి పాముకాటుతో మరణించాడు. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తికి కూడా పాము కాటేయగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలేం జరిగిందంటే?
స్థానికుల సమాచారం ప్రకారం.. నూతన సంవత్సర వేడుకలలో మణికందన్ అలియాస్ పప్పు అనే వ్యక్తి పాల్గొన్నాడు. మద్యం ఫూటుగా సేవించి వచ్చాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ పామును చూసి పట్టుకున్నాడు. తర్వాత ఆ సర్పాన్ని న్యూ ఇయర్ గిఫ్ట్ అని తన స్నేహితులకు చూపించి అరిచాడు. అది చూసిన వారంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

person died to snake bite in tamil nadu
పాముకాటుతో మృతి చెందిన మణికందన్

అయితే రెప్పపాటులో ఆ పాము మణికందన్​ను కాటేసింది. వెంటనే అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మణికందన్​ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. మణికందన్​తో పాటు వచ్చిన మరో వ్యక్తి కపిలన్​ను కూడా ఆ పాము కాటేసింది. ప్రస్తుతం అతడు​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాటేసిన పామును స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అది రసెల్​ జాతి సర్పం అని వైద్యులు తెలిపారు.

Last Updated : Jan 2, 2023, 4:33 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.