ETV Bharat / bharat

ఎయిర్​పోర్ట్​లో హెరాయిన్​​ సీజ్​-విలువ రూ.200 కోట్లపైనే.. - tripura drugs

Drugs News Mumbai: మహారాష్ట్ర, త్రిపుర, బంగాల్​ రాష్ట్రాల్లో అధికారులు జరిపిన సోదాల్లో మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి. ముంబయిలో రూ.247 కోట్లు విలువ చేసే హెరాయిన్​ను గుర్తించారు అధికారులు

airport
ఎయిర్​పోర్ట్​లో హెరాయిన్​​ సీజ్​-విలువ రూ.200 కోట్లపైనే..
author img

By

Published : Dec 9, 2021, 9:26 PM IST

Drugs News Mumbai: ముంబయిలో మరోసారి డ్రగ్స్​ కలకలం రేపాయి. నగరంలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు ఏయిర్​పోర్ట్​ ఇంటలిజెన్స్​ అధికారులు. 35 కిలోలు ఉన్న ఈ హెరాయిన్​ విలువ రూ.247 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

డ్రగ్స్​ను తరలించేందుకు యత్నించిన 46 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు జింబాబ్వే వాసులుగా అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్​ 31 డిసెంబరు కోసం తరలిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

200 కిలోల గంజాయి..

బంగాల్​లోని బిర్​భమ్​ జిల్లా కాచుజోర్​ గ్రామంలో అధికారులు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కోళ్ల ఫార్మ్​లో ఈ గంజాయిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పౌల్ట్రీఫార్మ్​ యజమానికి అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

త్రిపురలో కూడా..

త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో గురువారం అధికారులు చేపట్టిన సోదాల్లో రూ.17.88 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్​లలో బంగ్లాదేశ్​ కరెన్సీ (33,000 టాకా) సహా 96 సీసాల మద్యాన్ని కూడా సీజ్​ చేశారు.

ఇదీ చూడండి : అప్పట్లో శత్రు విమానాలను హడలెత్తించి.. ఇప్పుడిలా విగతజీవిగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.