Drone Attack On Ship India : అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైన వాణిజ్య నౌక MV కెమ్ ఫ్లూటో ఎట్టకేలకు ముంబయి హార్బర్‌కు చేరింది. దాన్ని ప్రాథమికంగా పరిశీలించిన భారత నావికాదళం డ్రోన్ దాడికి గురైందని నిర్ధరించింది. దెబ్బతిన్న నౌక భాగాల ఫొటోలు విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఫోరెన్సిక్ దర్యాప్తు చేసిన తర్వాత మరమ్మతులు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హమాస్‌కు మద్దతుగా హౌతీ రెబల్స్ ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఫ్లూటో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. హౌతీలే దాడి చేశారని అమెరికా తెలిపింది. లైబేరియా జెండా ఉన్న ప్లూటో భారత్‌లోని మంగుళూరు పోర్టుకు వస్తుండగా పోర్‌బందర్‌కు 217 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. భారత కోస్టుగార్డు నౌక ICGS విక్రమ్ రెస్క్యూ చేపట్టింది. అందులోని 21 మంది భారతీయులతో పాటు వియత్నాం వాసి సురక్షితంగా బయటపడ్డారు. ICGS నౌక ఎస్కార్ట్‌గా రక్షణ కల్పిస్తుండగా, ఎంవీ ఫ్లూటో ముంబయి తీరానికి వచ్చింది. మరోవైపు నౌకలపై దాడుల దృష్ట్యా అరేబియా సముద్రంలో నిఘా కోసం P-8I గస్తీ విమానాలు, INS మొర్ముగో, INS కొచ్చి, INS కోల్‌కతా యుద్ధనౌకలను ఇండియన్ నేవీ మోహరించింది.
-
More images of the damage caused by the suspected drone attack on the merchant ship MV Chem Pluto. An Indian Navy team is assessing the damage caused by the strike and also investigating how the attack was carried out in the Arabian Sea. Indian Navy warships will be further… pic.twitter.com/sjidfAPqPK
— ANI (@ANI) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">More images of the damage caused by the suspected drone attack on the merchant ship MV Chem Pluto. An Indian Navy team is assessing the damage caused by the strike and also investigating how the attack was carried out in the Arabian Sea. Indian Navy warships will be further… pic.twitter.com/sjidfAPqPK
— ANI (@ANI) December 25, 2023More images of the damage caused by the suspected drone attack on the merchant ship MV Chem Pluto. An Indian Navy team is assessing the damage caused by the strike and also investigating how the attack was carried out in the Arabian Sea. Indian Navy warships will be further… pic.twitter.com/sjidfAPqPK
— ANI (@ANI) December 25, 2023
సరకు రవాణా నౌక హైజాక్
Israel Ship Hijacked Video : కొన్నాళ్ల క్రితం గెలాక్సీలీడర్ అనే సరకు రవాణా నౌకను హైజాక్ చేసిన వీడియోను హౌతీరెబల్స్ బహిర్గతం చేశారు. ఎర్ర సముద్రంపై వెళుతున్న ఆ కార్గో షిప్‌ను ఓ హెలికాప్టర్‌తో వెంబడించి రెబల్స్ అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు హాలీవుడ్ సినిమాలో యాక్షన్ సీన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.
-
Footage of Houthi forces hijacking the ship Galaxy Leader in the Red Sea yesterday. pic.twitter.com/PSFLpV4FLA
— OSINTtechnical (@Osinttechnical) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Footage of Houthi forces hijacking the ship Galaxy Leader in the Red Sea yesterday. pic.twitter.com/PSFLpV4FLA
— OSINTtechnical (@Osinttechnical) November 20, 2023Footage of Houthi forces hijacking the ship Galaxy Leader in the Red Sea yesterday. pic.twitter.com/PSFLpV4FLA
— OSINTtechnical (@Osinttechnical) November 20, 2023
హైజాక్ చేశారిలా
తిరుగుబాటుదారులు హెలికాప్టర్‌లో ఎర్రసముద్రంపై ఉన్న నౌక దగ్గరకు చేరుకున్నారు. షిప్‌పై ఎవరూ లేని సమయంలో హెలికాప్టర్ ఓడ డెక్‌పై ల్యాండ్ అయింది. అందులోంచి దిగిన హౌతీరెబల్స్ నినాదాలు చేస్తూ, కాల్పులు జరుపుతూ పరిగెత్తి వీల్‌హౌస్, కంట్రోల్ సెంటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత నౌకను యెమెన్‌లోని సలీఫ్ పోర్టుకు మళ్లించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.