DRI seizes 10.27 kg of Smuggled Gold: కస్టమ్స్ పన్నులను ఎగవేసేందుకు కొందరు బంగారం వ్యాపారులు విదేశాల్లో బంగారం కొనుగోలు చేస్తూ... అక్కడి నుంచి ఆ బంగారాన్ని వివిధ మార్గాల్లో భారత దేశంలో కి దిగుమతి చేసి.. తద్వారా అక్రంగా ఆదాయం పోగేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా... విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని అక్రమంగా దేశంలోకి రవాణా చేయడం పరిపాటిగా మారిపోయింది. బంగారం అక్రమ రవాణ కట్టడి కోసం కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... బంగారం అక్రమ రవాణ మాత్రం అగడం లేదు. అయితే, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డీఆర్ఐ) బంగారం అక్రమంగా రవాణా చేసే వారికి గుండెల్లో సింహస్వప్నంలా మారింది. బంగారం అక్రమ రవాణ చేస్తున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దేశంలో జరుగుతున్న అక్రమ రవాణను అడ్డుకట్ట వేయడంలో డీఆర్ఐ కీలక పాత్ర వహిస్తుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 10.27 విదేశీ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన డీఆర్ఐ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కడప గడపలో అక్రమ బంగారం.. 7 కిలోలు పట్టివేత
పక్కా సమాచారంతో పట్టుకున్న డీఆర్ఐ: నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 10.27 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారం తరలించడం కోసం ప్రత్యేకంగా కారు సీటు కింద అర చేయించారు. అందులో బంగారాన్ని తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారం అక్రమంగా తరలిస్తున్నారని పక్కా సమాచారంతో.. ఈనెల 7న రాత్రి కారు అడ్డగించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కారులో అర కింద పెట్టి తరలిస్తున్న సుమారు 7,798 గ్రాముల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కారులోని ఇద్దరు క్యారియర్లు, రిసీవర్‌ను అరెస్టు చేసిన అధికారులు వారు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో దాచిన మరో 2,471 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
జీఎస్టీ, కస్టమ్స్ పన్నుల ఎగవేత: ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న బంగారం విలువ కోట్లలో ఉంటుందని పూర్తి సమాచరాన్ని త్వరలోనే వెల్లడిస్తామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. చెన్నై తదితర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారని తెలిపారు. గత కొంత కాలంగా అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. అక్రమ రవాణ ద్వారా జీఎస్టీ, కస్టమ్స్ పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
బంగారం అక్రమ రవాణా అడ్డాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. 4 రోజుల్లో 13 కిలోలు స్వాధీనం