Brahmos Missile Air Version Test: భారతదేశపు అత్యున్నత క్షిపణి వ్యవస్థల్లో ఒకటైన బ్రహ్మోస్.. మరో మైలురాయిని అధిగమించింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి సిరీస్లో ముఖ్యమైన ఎయిర్ వెర్షన్ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది.
Brahmos Supersonic Cruise Missile: దీనిని సూపర్సోనిక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ సుఖోయ్-30 ఎంకే-1 నుంచి బుధవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించగా.. నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేరుకున్నట్లు వెల్లడించింది డీఆర్డీఓ. ఎయిర్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తికి ఈ ప్రయోగం దోహదపడుతుందని ప్రకటించింది.
Rajnath Singh DRDO: మిషన్ విజయవంతం అయిన నేపథ్యంలో.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ప్రశంసించారు.
ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ జీ. సతీశ్ రెడ్డి అభినందించారు.
బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత్-రష్యా సంయుక్తంగా దీన్ని అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ చేసేలా ఒప్పందం కుదిరింది.
ఇవీ చదవండి: