ETV Bharat / bharat

కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్​ వ్యవస్థ - డీఆర్​డీఓ

కరోనా బాధితుల కోసం అనుబంధ ఆక్సిజన్​ బట్వాడా వ్యవస్థను అభివృద్ధి చేసింది రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్​డీఓ). శరీరంలో 'బ్లడ్​ ఆక్సిజన్​ శాచురేషన్​(ఎస్​సీఓ2)' స్థాయి ఆధారంగా అనుబంధ ఆక్సిజన్​ను సరఫరా చేస్తుందని తెలిపింది. ఇది ఆటోమెటిక్​ వ్యవస్థ అని పేర్కొంది.

blood oxygen saturation
బ్లడ్​ ఆక్సిజన్​ శాచురేషన్​
author img

By

Published : Apr 20, 2021, 7:18 AM IST

కొవిడ్​-19 బాధితులు, అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల కోసం అనుబంధ ఆక్సిజన్​ బట్వాడా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) సోమవారం ప్రకటించింది. ఇది ఆటోమెటిక్​ వ్యవస్థ అని, శరీరంలో 'బ్లడ్​ ఆక్సిజన్​ శాచురేషన్​(ఎస్​సీఓ2)' స్థాయి ఆధారంగా అనుబంధ ఆక్సిజన్​ను సరఫరా చేస్తుందని తెలిపింది.

blood oxygen saturation
డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన సాధనం

తద్వారా బాధితుల హైపోక్సియా అనే ప్రాణాంతక స్థితిలోకి జారిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందని డీఆర్​డీఓ పేర్కొంది. కొవిడ్​ బాధితుల్లో ఈ సమస్య తలెత్తుతుంటుంది. తాము రూపొందించిన సాధనం ఖరీదు తక్కువేనని డీఆర్​డీఓ తెలిపింది. వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం కోసం సంబంధిత పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు బదిలీ చేసినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.