ETV Bharat / bharat

ప్రథమ పీఠంపై గిరి పుత్రిక.. భారీ ఆధిక్యంతో ముర్ము ఘన విజయం - ద్రౌపదీ ముర్ము ేట

Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే. గురువారం దిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా ఆమె నివాసానికి వెళ్లి మిఠాయి తినిపించారు.

murmu
murmu
author img

By

Published : Jul 22, 2022, 5:25 AM IST

Updated : Jul 22, 2022, 7:24 AM IST

Draupadi Murmu: అంచనాలను నిజం చేస్తూ భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. గురువారం పార్లమెంటు ప్రాంగణంలో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి. పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 3వ రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యేప్పటికే ద్రౌపదికి 51% ఓట్లు వచ్చినట్లు తేలడంతో గెలుపు ఖాయమైపోయింది. దాంతో యశ్వంత్‌సిన్హా తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఆ వెంటనే దిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా ఆమె నివాసానికి వెళ్లి మిఠాయి తినిపించారు. విజేతకు అభినందనలు చెబుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 4 రౌండ్లుగా సాగి రాత్రి 9.30 గంటలకు ముగిసింది. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే.

ఆంధ్రప్రదేశ్‌తో మొదలు
పార్లమెంటు సభ్యులు, పార్లమెంటులో ఓటేసిన ఎమ్మెల్యేల ఓట్లను వేరుచేసి తొలిరౌండ్‌లో ఎంపీలవి లెక్కించారు. తర్వాత 3 రౌండ్లలో అక్షరక్రమంలో ఏపీతో మొదలుపెట్టి పదేసి రాష్ట్రాల ఓట్లను ఒక్కో రౌండ్‌ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కించారు. కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరిలను చివర్లో లెక్కించారు. యశ్వంత్‌సిన్హాకు ఆంధ్రప్రదేశ్‌, నాగాలాండ్‌, సిక్కింలలో ఒక్క ఓటు కూడా పడలేదు. ద్రౌపదీ ముర్ముకు అలాంటి పరిస్థితి ఒక్కచోటా ఎదురుకాలేదు. కేరళలో 100% ఓట్లు యశ్వంత్‌సిన్హాకే పడతాయని భావించినా అక్కడ ద్రౌపదికి ఒకటి దక్కింది. పంజాబ్‌, దిల్లీల్లో 8 ఓట్లే పడ్డాయి. విపక్షాలకు చెందిన 17మంది ఎంపీలు, 125 మంది ఎమ్మెల్యేలు ద్రౌపదికి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు భాజపావర్గాలు చెబుతున్నాయి.

murmu
.

చెల్లని ఓట్లు వేసినవారిలో 15 మంది ఎంపీలు, 38 మంది ఎమ్మెల్యేలు
చెల్లుబాటు కాని 53 ఓట్లలో 15 పార్లమెంటు సభ్యులవి కాగా, 38 ఎమ్మెల్యేలవి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో అత్యధికంగా అయిదేసి ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. 2017 ఎన్నికల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌కు వచ్చిన 65.65% కంటే ద్రౌపదికి కాస్త తగ్గగా, అప్పటి ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు వచ్చిన 34.35% కంటే యశ్వంత్‌ సిన్హాకు కొంత ఎక్కువ వచ్చాయి. లెక్కింపు జరిపిన ప్రతి రౌండ్‌లోనూ ద్రౌపది అత్యధిక మెజార్టీ సాధిస్తూ అప్రతిహతంగా సాగిపోయారు. పార్లమెంటు ఉభయ సభలతో పాటు, అత్యధిక రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్డీయే కూటమికి బలం ఉండటంతో ఆమె గెలుపు ముందే తేలిపోయింది. ఎన్డీయేలో లేని కొన్ని పక్షాలూ ఆమెకు మద్దతు పలకడంతో విజయం నల్లేరు మీద నడకైపోయింది. క్రాస్‌ ఓటింగ్‌తో మెజార్టీ ఆశించినదానికన్నా పెరిగింది. ముర్ముకు ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల్లో అత్యధిక ఓట్లు వచ్చాయి. యశ్వంత్‌సిన్హాకు పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, దిల్లీలలో అధికార పార్టీ కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి.

murmu
.

తొలిసారి తెలుగు సీజేఐ చేతుల మీదుగా..
వీవీ గిరి తర్వాత ఒడిశా నుంచి అత్యున్నత పదవి చేపట్టబోతున్న నాయకురాలు ద్రౌపది కావడంతో ఆ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. భాజపా ఈ విజయాన్ని గతంలో ఎన్నడూలేని విధంగా ఘనంగా నిర్వహిస్తోంది. దిల్లీలోని ప్రధాన వీధుల్లో ప్రత్యేక వేదికలు ఏర్పాటుచేసి మేళతాళాలతో విజయ దుందుభిని బిగ్గరగా మోగించింది. ఈనెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రాష్ట్రపతి భవన్‌లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి చేత తెలుగు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించడం ఇదే ప్రథమం అవుతుంది.

murmu
.

ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ
పార్టీలకు అతీతంగా ఆమెకు మద్దతు పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ద్రౌపదిని అభినందించినవారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా సీఎంలు మమతాబెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ తదితరులు ఉన్నారు. ముర్ము విజయంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు.

murmu
.

స్వస్థలంలో సంబరాలు
ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయ్‌రంగపుర్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆమె స్వస్థలమైన ఉపర్‌బెడలో పండుగ వాతావరణం నెలకొంది. ఆమెకు మద్దతు ప్రకటించిన బిజూజనతాదళ్‌ పార్టీ వర్గాలు కూడా సామాన్యులతో కలిసి టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ గెలుపును ఆస్వాదించాయి.

murmu
.

"స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ గిరిజన తెగకు చెందిన పుత్రికను అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నుకోవడం ద్వారా భారతదేశం కొత్త చరిత్రను లిఖించుకుంది. ప్రజలకు, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీనవర్గాలకు ముర్ము ఒక ఆశాకిరణంగా నిలిచారు. ఆమె సాధించిన ఘన విజయం ప్రజాస్వామ్యానికి శుభసంకేతం."

- ప్రధాని నరేంద్ర మోదీ

"ప్రజా జీవితంలో ముర్ముకు ఉన్న విస్తృత అనుభవం, నిస్వార్థ సేవా గుణం, ప్రజా సమస్యల్ని లోతుగా అర్థం చేసుకునే తత్వం దేశానికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. ఆమె పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా."

- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

"ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా రాజ్యాంగ సంరక్షకురాలిగా ముర్ము విధులు నిర్వర్తిస్తారని ఆశాభావంతో ఉన్నాను. నాకు ఓటువేసిన వారందరికీ కృతజ్ఞతలు. ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలన్న కర్మసిద్ధాంతం ప్రకారం నేను పోటీ చేశాను. నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు పోరాడతాను."

-యశ్వంత్‌ సిన్హా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి

తెలంగాణలో ముర్ముకు 3 ఓట్లు..
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోలైన ఎమ్మెల్యేల ఓట్లలో యశ్వంత్‌ సిన్హాకు 113 ఓట్లుండగా ద్రౌపదికి కేవలం మూడే వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. పోలింగు రోజున 117 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. పోలింగ్‌ సమయంలో ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తన ఓటు వేసే క్రమంలో బ్యాలెట్‌పై ఇంక్‌ పడిందని చెప్పారు. ఆమె మరో బ్యాలెట్‌ అడిగినా అధికారులు అంగీకరించలేదు. చెల్లని ఓటు సీతక్కదా లేదా మరెవరిదైనా అనే దానిపై స్పష్టత లేదు.

murmu
.

మూడు రౌండ్లు ముర్మువి... నాలుగో రౌండ్‌ యశ్వంత్‌ది
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి మూడు రౌండ్లు ద్రౌపదీ ముర్ము ఆధిక్యం ప్రదర్శించగా, నాలుగో రౌండ్‌లో యశ్వంత్‌ సిన్హా ఆధిక్యం కనబరిచారు. తొలివిడతలో ఎంపీల ఓట్లను మాత్రమే లెక్కించారు. ఉభయసభల్లో ఎన్డీయేకి ఆధిక్యం ఉండటంతో అందులో ఆమె అప్రతిహతంగా దూసుకుపోయారు. ఏకంగా 2.32 లక్షల మెజార్టీని మూటగట్టుకున్నారు. రెండో రౌండ్‌లో అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ల ఓట్లను లెక్కించారు. ఇందులో ఛత్తీస్‌గఢ్‌ మినహా మిగిలిన 9 రాష్ట్రాలు ఎన్డీయే, అనుబంధ పార్టీలకు ఆధిక్యం ఉండటంతో ఆమెకు ఆ రౌండ్‌లో 61,023 ఓట్ల మెజార్టీ దక్కింది.

murmu
.

మూడో విడతలో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పంజాబ్‌ ఓట్లను లెక్కించారు. ఇందులో కేరళ, పంజాబ్‌ల్లో యశ్వంత్‌ సిన్హాకు ఏకపక్షంగా ఓట్లు పడటం... కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లోనూ విపక్షాల ఓట్లు చెప్పుకోదగ్గ రీతిలో ఉండటంతో ముర్ము మెజార్టీ 23,292కి తగ్గిపోయింది. నాలుగో రౌండ్‌లో రాజస్థాన్‌, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, దిల్లీ, పుదుచ్చేరి ఓట్లను లెక్కించారు. ఇక్కడ రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో సిన్హాకు ఏకపక్షంగా ఓట్లు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు దక్కడంతో ఎన్డీయే అభ్యర్థికంటే ఆయనకు 20,089 ఓట్లు అధికంగా వచ్చాయి.

ఇవీ చదవండి:ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ.. ఇంటికి వెళ్లి అభినందించిన ప్రధాని మోదీ

అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు.. ద్రౌపదీ ముర్ము ప్రస్థానం

Last Updated : Jul 22, 2022, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.