ETV Bharat / bharat

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. కిడ్నీ సమస్య తీవ్రం - లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ 25 శాతం

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆయన కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందని.. ఏ క్షణమైనా ఇది మరింత పడిపోవచ్చని చెప్పారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి మెరుగుపడకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

dr-umesh-prashad-told-kidney-of-lalu-prasad-yadav-is-only-25-percent-functional
లాలూ కిడ్నీ సమస్య తీవ్రం.. ఏ క్షణమైనా!
author img

By

Published : Dec 12, 2020, 6:43 PM IST

పశుగ్రాసం కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఏ క్షణంలోనైనా కిడ్నీ పనితీరు పడిపోవచ్చని ఆయనకు చికిత్స చేస్తున్న డా. ఉమేష్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని రిమ్స్ అధికారులకు తెలియజేసినట్లు స్పష్టం చేశారు.

"నేను ఇదివరకు చెప్పిన విధంగానే లాలూ యాదవ్ కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందన్నది వాస్తవం. ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏ క్షణంలోనైనా ఆయన కిడ్నీ పనితీరు క్షీణించవచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఆయనకు 20 ఏళ్లుగా డయాబెటిస్ ఉంది కాబట్టి ఆయన అవయవాలు దెబ్బతింటున్నాయి. ఏ క్షణంలోనైనా అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని రిమ్స్ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించాం."

-డా. ఉమేష్ ప్రసాద్, వైద్యుడు

లాలూను వేరే ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని ఉమేష్ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డయాబెటిస్ వల్ల అవయవాలు దెబ్బతినడాన్ని ఏ ఔషధాలూ నయం చేయలేవని అన్నారు. 25 శాతం పనిచేస్తున్న కిడ్నీని 100 శాతం పనిచేయించే విధంగా ఎలాంటి చికిత్స లేదని తెలిపారు. స్థానిక నెఫ్రాలజిస్ట్​ను సంప్రదించి.. చికిత్సపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.