ఒడిశాలో వైద్యుడి నిర్లక్ష్యం ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. పొట్టలో నొప్పితో మూడు జిల్లాల్లో 4 ఆసుపత్రుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కోరాపుట్ జిల్లా నందాపుర్ బ్లాకులో పరాటా గ్రామానికి చెందిన సావిత్రి మజ్హి.. జయపుర్లోని జిల్లా కేంద్ర ఆసుపత్రి(డీహెచ్హెచ్)లో మార్చి 16న కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత పొత్తి కడుపులో నొప్పి వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఎక్స్-రే తీయగా అందులో విరిగిన సూది ఉన్నట్లు తేలింది. ఆ సూదిని బయటకు తీసేందుకు.. వెంటనే ఎన్ఎల్ఎన్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు డీహెచ్హెచ్ వైద్య సిబ్బంది.
అయితే అక్కడ కూడా అందుకు తగిన చికిత్స అందుబాటులోలేక.. వేరే ఆసుపత్రికి తరలించారు. చివరకు ఎస్సీబీ ఆసుపత్రిలో వైద్యుల బృందం రెండు గంటలపాటు శ్రమించి విజయవంతంగా ఆ సూదిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వృద్ధురాలిపై అత్యాచారం.. కత్తితో దాడి