విదేశీ రామచిలుక విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చిలుక తమదేనంటూ ఇరువర్గాలు ఆరోపించుకున్నాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. ఆగ్రాలోని కమలానగర్లో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయినా వివాదం సద్దుమణగకపోవడం వల్ల ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అసలేమైందంటే..?
ఓ వ్యక్తి మూడేళ్ల కిందట విదేశీ రామచిలుకను మరో కుటుంబానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఆ రామచిలుక ధర రూ.60 వేలు పలుకుతోందని తెలుసుకున్న అతడు.. వేరొకరికి విక్రయించాలని అనుకున్నాడు. డబ్బుకు ఆశపడి తాను గిఫ్ట్‌గా ఇచ్చిన రామచిలుకను తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. తాము ఇన్నిరోజులూ ప్రేమగా పెంచుకున్న చిలుకను ఇచ్చేదే లేదని ఆ కుటుంబం తేల్చి చెప్పింది. ఇక వివాదం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది.
అయితే, ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన సమస్యను రామచిలుక ద్వారానే కొలిక్కి తెచ్చారు పోలీసులు. తొలుత, పోలీస్ స్టేషన్ టేబుల్‌పై రామచిలుకను ఉంచారు. అనంతరం ఇరు కుటుంబాలను టేబుల్‌కు చెరో వైపు కూర్చొబెట్టారు. పంజరం నుంచి చిలుకను వదిలిపెట్టారు. అప్పుడు చిలుక.. తనను మూడు సంవత్సరాల నుంచి పెంచుతున్న యజమానికి దగ్గరికి వెళ్లింది. దీంతో ఆ కుటుంబానికే రామచిలుకను పోలీసులు అప్పగించారు.
ఇవీ చదవండి: