Director General of Health Services Recruitment 2023 : మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే! కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఏ ఉద్యోగాలున్నాయి? వయో పరిమితి ఎంత? దరఖాస్తుకు చివరితేదీ మొదలైన వివరాలు మీకోసం.
ఏయే పోస్టులు(ఉద్యోగాల సంఖ్య)-విద్యార్హత
- రిసెర్చ్ అసిస్టెంట్(12)- సంబంధిత విభాగంలో పీజీ చేసి ఉండాలి
- టెక్నీషియన్ (6)- సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి
- హెల్త్ ఇన్స్‌స్పెక్టర్(06)- ఇంటర్(12), డిప్లొమా, ఏదైనా డిగ్రీ
- లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (06)-ఇంటర్
- ఫిజియోథెరపిస్ట్(06)-డిప్లొమా/ డిగ్రీ(ఫిజియోథెరపీ)
- మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(06)- సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ
- X-ray టెక్నీషియన్(06)- పదో తరగతి
- మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీస్ట్(06)- డిగ్రీ(మెడికల్ లేబోరేటరీ సైన్స్)
వయో పరిమితి :
- అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి.
- గరిష్ఠ వయసు 25, 27, 30 ఏళ్లు (పోస్టులను బట్టి)
- నిబంధనల ప్రకారం వయో పరిమితిపై సండలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్లైన్లో డీజీహెచ్ఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం : 11-11-2023
- ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ : 30-11-2023
- ఎంపిక విధానం, పరీక్షా కేంద్రాల వివరాలు, వేతనం, విద్యార్హతల మరిన్ని వివరాల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) అధికారిక వెబ్సైట్ ( https://hlldghs.cbtexam.in/Home/index.html ) ను సందర్శించండి.
సశస్త్ర సీమా బల్( ఎస్స్బీ)లో ఎస్ఐ ఉద్యోగాలు
కేంద్రహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) 2023 సంవత్సరానికి సంబంధించి 111 సబ్ ఇన్స్పెక్టర్(ఎస్.ఐ) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 19.
పోస్టులు
- సబ్-ఇన్స్పెక్టర్(పయోనీర్)-20-డిగ్రీ ,సివిల్ ఇంజినీరింగ్ డిప్లమా
- సబ్-ఇన్స్పెక్టర్(డ్రాట్స్‌మెన్)-3-పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- సబ్-ఇన్స్పెక్టర్(కమ్యూనికేషన్)-59-ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్.
- సబ్-ఇన్స్పెక్టర్(స్టాఫ్ నర్స్-ఫీమెల్)-29 -ఇంటర్మీడియేట్
వయో పరిమితి
- అభ్యర్థులు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. స్టాఫ్ నర్స్ పోస్టులకు యువతులు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
- మరి ఈ ఉద్యోగానికి అప్లైచేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, జీత భత్యాలు, దరఖాస్తు విధానం లాంటి వివరాలకోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
స్పోర్ట్స్ కోటాతో తపాలా శాఖలో ఉద్యోగాలు- రూ80 వేల జీతం! అర్హతలు ఏంటంటే?
ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు- రూ90వేల జీతం! అప్లై చేసుకోండిలా