ETV Bharat / bharat

చైనా ఘటనతో భారత్ అప్రమత్తం.. 'బోయింగ్​' విమానాలపై నిఘా - బోయింగ్​ 737 విమానం

DGCA Boeing 737: భారత్​లోని బోయింగ్​ 737 విమానాలపై నిఘా పెంచాలని డైరక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ నిర్ణయించింది. చైనాలో విమాన ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మూడు ప్రధాన విమానయాన సంస్థలు ఈ రకం విమానాలతో సేవలు అందిస్తున్నాయి.

boeing flights
బోయింగ్​ విమానాలు
author img

By

Published : Mar 21, 2022, 10:43 PM IST

DGCA Boeing 737: చైనాలో జరిగిన విమాన ప్రమాదం దేశంలోని విమాయాన సంస్థల్లో కలకలం రేపింది. ప్రమాదానికి గురైన బోయింగ్​ 737 రకానికి చెందిన విమానాలతోనే చాలా సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై నిఘా పెంచాలని డైరెక్టర్ జనరల్​ ఆఫ్ సివిల్​ ఏవియేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో స్పైస్​జెట్​, విస్తారా, ఎయిర్​ఇండియా ఎక్స్​ప్రెస్​లు బోయింగ్​ 737 విమానాలతో సేవలు అందిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ఒకప్పుడు నిషేధించినవే..

కొంతకాలం క్రితం డీజీసీఏ బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానాలపై నిషేధం విధించింది. అక్టోబరు 2018 నుంచి మార్చి 2019 మధ్య జరిగిన విమాన ప్రమాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో 346 మంది ప్రాణాలు కోల్పోయారు. డీజీసీఏ ఆదేశాల మేరకు విమానాల సాంకేతికతలో మార్పులు చేశాక గతేడాది ఆగస్టులో ఈ విమానాలపై నిషేధం తొలగించింది.

అయితే.. బోయింగ్​ 737 విమానాలపై నిఘా పెడతామన్న డీజీసీఏ నిర్ణయంపై ఆ రకం విమానాలతో సేవలు అందిస్తున్న స్పైస్​జెట్​, విస్తారా, ఎయిర్​ఇండియాలు స్పందించాల్సి ఉంది.

చైనాలో 132 మందితో వెళ్తున్న ప్రయాణికుల విమానం గువాంగ్​షీ రాష్ట్రం, వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. చైనా ఈస్టర్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్​ 737 విమానం.. కున్​మింగ్​ నుంచి గువాంగ్​ ఝౌకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాంతీయ విపత్తు స్పందన విభాగం వెల్లడించింది.

ఇదీ చూడండి : మున్సిపల్​ ట్రక్కు బీభత్సం.. బాలిక బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.