ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పనితీరుపై సమగ్ర విశ్లేషణ జరపాలని భాజపా కేంద్ర నాయకత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలకు కార్యకర్తలు చేరువ కావాలని ఆయన తెలిపినట్లు పేర్కొన్నాయి.
రెండో దశ కరోనా సమయంలో పార్టీ చేసిన సహాయక చర్యలు సహా.. బంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరుపై రెండురోజుల పాటు జరిగిన సమావేశంలో భాజపా చర్చించింది. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా.. ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సమావేశం అనంతరం ప్రధాని అధికారిక నివాసంలో కలిసిన నేతలతో నాలుగు గంటలకు పైగా చర్చించారు మోదీ. వ్యవస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం సహా.. క్షేత్రస్థాయిలో విస్తరణపై పలు సూచనలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కీలకమైన ఉత్తర్ప్రదేశ్ సహా.. వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.
అంతకుముందు.. సమీక్ష వివరాలను మోదీకి వివరించిన భాజపా నేతలు బంగాల్లో పార్టీ గణనీయంగా పుంజుకోవడమే గాక.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: చెదిరిన భాజపా 'బంగాల్' స్వప్నం.. కానీ..