పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడులో(tamil nadu weather) తీరం దాటింది. ఈ సాయంత్రం చెన్నైకి సమీపంలో తీరం దాటగా.. పరిసర ప్రాంతాల్లో భీకర గాలులు వీచాయి. తమిళనాడులోని చెన్నై(chennai floods today), తిరువళ్లూరు, కంజివరం, రాణిపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ వాయుగుండం ప్రభావంతో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెన్నై సహా పొరుగున ఉన్న చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం తదితర జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు.
![tamil nadu rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13604285_7.jpg)
![tamil nadu rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13604285_6.jpg)
![tamil nadu rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13604285_5.jpg)
ఆస్పత్రి జలదిగ్భంధం...
చెన్నైలో(chennai floods live) వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షానికి.. ఈఎస్ఐ ఆస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆస్పత్రి వార్డుల్లో.. మోకాలు లోతు వరకు వరద చేరింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రముఖ మెరీనా బీచ్‌ను కూడా వరద ముంచెత్తింది. ఇసుక తిన్నెలపై వరద చేరగా.. సందర్శకుల గ్యాలరీలు, దుకాణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైకి తాగునీరు సరఫరా చేసే మెట్టూరు డ్యామ్ సహా అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోగా.. దిగువకు నీటిని వదులుతున్నారు.
![tamil nadu rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13604285_4.jpg)
ఇదీ చూడండి:- మహిళా పోలీసు సాహసం.. వరద బాధితుడిని భుజాలపై మోసుకెళ్లి..
స్టాలిన్ సమీక్ష...
తమిళనాడులో వ్యవసాయంపై కూడా భారీ వర్షాలు తీవ్ర ప్రభావమే చూపాయి. డెల్టా జిల్లాలో లక్షా 50వేలకుపైగా ఎకరాల్లోని వివిధ రకాల పంటలు నీట మునిగాయి. తిరువూరులో 50వేల ఎకరాలు, కడలూరులో 25వేల ఎకరాలు, నాగపట్టణంలో.... 30వేల ఎకరాలు, మయిలదుథురైలో 20వేలు, తంజావూర్‌లో 10వేల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. పంటనష్టం అంచనా వేసేందుకు. సీనియర్ మంత్రి పెరియస్వామి సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
![tamil nadu rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13604285_3.jpg)
ఇదే సమయంలో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలపై సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని సూచించారు.
![tamil nadu rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13604285_1.jpg)
'జాగ్రత్తగా ఉండండి'
భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 91 మంది మరణించారు. మరణాల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారులిచ్చిన ఆదేశాలను పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:- 'డెల్టా'లో వరద బీభత్సం- 1.5లక్షల ఎకరాల పంట నాశనం