ETV Bharat / bharat

58 ఏళ్ల తల్లిపై కొడుకు అత్యాచారం- చంపేస్తానని బెదిరించి... - కన్న తల్లిపై కొడుకు అత్యాచారం

Son Rapes Mother: భార్య పుట్టింటికి వెళ్లిన క్రమంలో కామంతో రగిలిపోయిన ఓ వ్యక్తి సొంత తల్లిపైనే రెండుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

Son Rapes Mother
Son Rapes Mother
author img

By

Published : Jan 14, 2022, 2:39 PM IST

Son Rapes Mother: కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వావివరసలు మరిచి.. క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. సొంత వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భార్య పుట్టింటికి వెళ్లిన క్రమంలో కామంతో రగిలిపోయిన ఓ వ్యక్తి.. 58ఏళ్ల వృద్ధ తల్లిపైనే రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన జనవరి 13న పుత్తూరు తాలూకాలోని కేదంబాడి గ్రామంలో జరిగింది.

చంపేస్తానని బెదిరించి..

జనవరి 12న రాత్రి భోజనం చేసిన తర్వాత తల్లి, కొడుకు నిద్రపోయారు. అయితే 13 తేదీన తెల్లవారుజామున 3 గంటలకు తల్లి పడుకున్న గదిలోకి వెళ్లి... ఆమె నోట్లో వస్త్రాలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. ఈ విషయం ఇంకెవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె తనలో తానే బాధపడుతూ కుంగిపోయింది. అదే రోజు ఆమె కిచెన్​లో​ వంట చేస్తుండగా.. ఆ కామాంధుడు మరోసారి అత్యాచారం చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.

ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Nun rape case: అత్యాచారం కేసులో క్యాథలిక్​ బిషప్​ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.