ప్రజాస్వామ్య సంరక్షణకు విపక్షాలు ఏకం కావాల్సిన్నారు బంగాల్ సీఎం మమతా బేనర్జీ. దిల్లీ పర్యట ముగింపు నేపథ్యంలో ప్రజాస్వామ్యం కొనసాగాలని.. అందుకు ప్రతి రెండు నెలలకు ఒకసారి దేశ రాజధానికి రానున్నట్లు తెలిపారు. ఈ పర్యటన విజయవంతమైనట్లు చెప్పారు.
"ఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాజకీయ కారణాలతో పలువురు సహచరులను కలిసాను. ప్రజాస్వామ్యం కొనసాగాలి. 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి'.. ఇదే మా నినాదం. ప్రతి రెండు నెలలకు ఒకసారి దిల్లీ వస్తాను. రాజకీయ ప్రయోజనం కోసం విపక్షాలు ఏకమవ్వడం కంటే గొప్పది మరేది లేదు. కొవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా నేను అనుకున్న ప్రతి నేతలను కలవలేకపోయాను. అయితే సమావేశాల ఫలితం బాగుంది. త్వరలోనే కలిసి పని చేద్దాం."
- మమత బెనర్జీ, బంగాల్ సీఎం
తాము సమగ్రాభివృద్ధి కోరుకుంటున్నామన్న మమత.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డున పడ్డ రైతన్నలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. దేశంలో మండిపోతున్న ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేసిన బంగాల్ సీఎం.. నిరుద్యోగం, కరోనా పరిస్థితులు ప్రజలకు భారంగా మారినట్లు పేర్కొన్నారు.
విపక్షాలను ఏకం చేయటమే లక్ష్యంగా దిల్లీలో పర్యటించిన మమతా.. సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో సమావేశమై చర్చించారు.
ఇవీ చూడండి: