ETV Bharat / bharat

Delivery Boy Tried To Rape Girl : కస్టమర్​పై డెలివరీ బాయ్​ అత్యాచారయత్నం.. ఎన్​కౌంటర్ చేసిన పోలీసులు - బాలికపై డెలివరీ బాయ్​ అత్యాచారయత్నం

Delivery Boy Tried To Rape Girl : నిత్యావసరాలు ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్​.. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే?

Delivery Boy Tried To Rape Girl
Delivery Boy Tried To Rape Girl
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 7:46 PM IST

Delivery Boy Tried To Rape Girl : నిత్యావసరాలు ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్​.. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన గ్రేటర్​ నొయిడాలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే లొంగిపోయినట్లుగా నటించిన నిందితుడు.. వాళ్ల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడిపై ఎదురుకాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ జరిగింది
గ్రేటర్‌ నొయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని బాధితురాలి కుటుంబం.. ఇంటికి అవసరమైన సరకులను ఆర్డర్‌ చేసింది. వాటిని తీసుకొని 23 ఏళ్ల సుమిత్‌ సింగ్ అనే డెలివరీ బాయ్‌ బాధితురాలి ఇంటికి వెళ్లాడు. సరకులు డెలివరీ చేసిన నిందితుడు.. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారని గమనించాడు. ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేయడానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడం వల్ల అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Delivery Boy Tried To Rape Girl
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితుడు సుమిత్​ ఉన్న చోటును గుర్తించి, అక్కడకు వెళ్లారు పోలీసులు. వారిని చూసిన నిందితుడు.. లొంగిపోయినట్లుగా నటించాడు. అంతలోనే ఎస్​ఐ భరత్ సింగ్​ నుంచి తుపాకీ లాక్కొని పరారయ్యాడు. తర్వాత పోలీసులు అతడిని వెంబడించగా వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై ఎదురుకాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. ఆస్పత్రి నుంచి విడుదల అయిన తర్వాత కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నాడన్న కారణంతో గతంలోనూ సుమిత్‌పై కేసు నమోదైందని దర్యాప్తులో తేలింది. అతడి సోదరుడు మనోజ్​పై బదల్​పుర్​ పోలీస్​ స్టేషన్​లో రౌడీ షీట్​ ఉందని పోలీసులు చెప్పారు.

Delivery Boy Tried To Rape Girl
నిందితుడు సుమిత్ సింగ్
ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలికపై డెలివరీ బాయ్​ అత్యాచారయత్నం

Knife In Young Man Stomach : ఐదేళ్లుగా యువకుడి కడుపులో కత్తి.. ట్యాబ్లెట్లు ఇచ్చి మేనేజ్​ చేసిన వైద్యుడు!

Rajasthan Accident News : ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి.. ఫంక్షన్​ నుంచి వస్తుండగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.