దిల్లీ హింసకు సంబంధించి కీలకమైన 1700 వీడియో క్లిప్పింగ్స్‌ను, వీడియో ఫుటేజ్‌లను దిల్లీ పోలీసులు సేకరించారు. వీటి ద్వారా నేరస్థులను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణల సహాయం తీసుకుంటున్నామని దిల్లీ క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ బీకే సింగ్ శనివారం తెలిపారు.
వీడియో క్లిప్స్‌పై విచారణ జరిపేందుకు జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్‌కు చెందిన బృందానికి సమాచారం ఇచ్చామని తెలిపారు. దిల్లీ హింసకు సంబంధించి సమాచారం, వీడియో క్లిప్పింగ్స్ ఉంటే తమకు ఇవ్వాలంటూ వార్తాపత్రికల ద్వారా ప్రజలకు శుక్రవారం అప్పీల్ చేశారు దిల్లీ పోలీసులు.
దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు ఎర్రకోటను శనివారం సందర్శించారు.
ఇదీ చదవండి : దిల్లీలో పోలీసు కుటుంబాల నిరసన ప్రదర్శన!