ETV Bharat / bharat

కోడలు, కుమార్తెపై కన్నేశాడని భర్తను కడతేర్చిన భార్య.. శవాన్ని 10 ముక్కలు చేసి.. - దిల్లీ పాండవ్ నగర్ భర్త హత్య

కత్తితో పొడిచి కిరాతకంగా హత్య.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్​లో​ భద్రపర్చడం.. రోజుకో శరీర భాగాన్ని దిల్లీ శివారులో పడేయటం.. ఇదంతా చూస్తుంటే ప్రేయసిని హత్య చేసిన ప్రియుడి ఉదంతం గుర్తొస్తోందా? కానీ ఇది అది కాదు. అచ్చం ఆ ఘటనను తలపించే మరో దారుణం! అయితే, ఇక్కడ భర్తనే కడతేర్చింది ఓ మహిళ.

pandav nagar murder
pandav nagar murder
author img

By

Published : Nov 28, 2022, 5:05 PM IST

శరీర భాగాలను పడేస్తున్న నిందితులు

దిల్లీలో శ్రద్ధా వాకర్ దారుణ హత్యను దేశప్రజలు మర్చిపోక ముందే.. అదే తరహాలో మరో పాశవిక హత్య వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ, తన కుమారుడితో కలిసి భర్తను కిరాతకంగా హతమార్చింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. ఫ్రిజ్​లో ఉంచారు నిందితులు. ఒక్కో భాగాన్ని ఒక్కో చోట బయటపడేశారు. దిల్లీలోని పాండవ్​నగర్​లో మే 30న ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని అంజనా దాస్​(45)గా గుర్తించారు. నిందితులు పూనమ్(48), ఆమె కుమారుడు దీపక్(25)ను సోమవారం అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే..
నిందితురాలు పూనమ్​కు 14ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. సుఖ్​దేవ్ తివారి అనే వ్యక్తితో వివాహం అయింది. కొద్దిరోజుల తర్వాత సుఖ్​దేవ్.. భార్యను వదిలేసి దిల్లీకి వెళ్లిపోయాడు. భర్తను వెతుక్కుంటూ పూనమ్ సైతం దిల్లీకి వెళ్లింది. ఈ క్రమంలోనే కల్లూ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్తా.. సహజీవనంగా మారింది. దీంతో ఇరువురూ దిల్లీలోనే ఉండిపోయారు. 2016లో కల్లూ చనిపోయాడు. ఆ తర్వాతి ఏడాది అంజనా దాస్​ను వివాహం చేసుకుంది పూనమ్.

అయితే, బిహార్​కు చెందిన అంజనా దాస్​కు అంతకుముందే ఓ వివాహం జరిగింది. ఎనిమిది మంది కొడుకులు కూడా ఉన్నారు. మృతుడు ఈ విషయాలను పూనమ్​కు తెలియకుండా దాచాడు. దీంతో అతడిని వివాహం చేసుకుంది పూనమ్. లిఫ్ట్ ఆపరేటర్​గా పనిచేసే అంజనా దాస్.. బిహార్​లోని తన కుటుంబంపైనే శ్రద్ధ పెట్టేవాడు. గతంలో ఓసారి పూనమ్ ఆభరణాలను విక్రయించి.. డబ్బును బిహార్ కుటుంబానికి పంపించాడు.

అనుమానంతో హత్య..
అయితే, పూనమ్​ సంతానంపై అంజనా దాస్ కన్నేశాడు. తన కూతురు, కోడలిపై కన్నేస్తున్నాడనే అనుమానంతో.. అతడిని హత్య చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. పూనమ్, ఆమె కుమారుడు కలిసి ఈ ఏడాది మార్చి- ఏప్రిల్​లోనే అంజనా దాస్ హత్యకు ప్లాన్ వేశారు. దాస్ తాగే పానీయంలో నిద్రమాత్రలు కలిపారు. స్పృహ కోల్పోయి పడిపోగానే.. కత్తితో పొడిచి చంపేశారు. గొంతు కోసి.. శరీరంలోని రక్తం అంతా బయటకు వెళ్లేలా చేశారు. బాడీ నుంచి రక్తం మొత్తం బయటకు వచ్చేశాక.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. శరీరాన్ని మొత్తం 10 భాగాలు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు శరీర భాగాలను ఓ ఫ్రిజ్​లో ఉంచారు. నాలుగు రోజుల పాటు తూర్పు దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి.. ఒక్కొక్కటిగా శరీర భాగాలను బయట పడేస్తూ వచ్చారు. పుర్రె భాగాన్ని భూమిలో పాతిపెట్టారు.

pandav nagar murder
పోలీసుల అదుపులో నిందితులు

"అతడు నా పిల్లలను చెడు దృష్టితో చూశాడు. అందుకే నేను ఆ పని చేశా. నేను చంపలేదు. నా కొడుకే కత్తితో పొడిచి చంపాడు" అని నిందితురాలు పూనమ్.. మీడియాకు చెప్పింది.

ఘటన ఎలా బయటపడిందంటే..
జూన్ 5న దిల్లీ కల్యాణ్​పురి ప్రాంతంలోని రాంలీలా మైదానం వద్ద శరీర భాగాలతో కూడిన ఓ సంచి బయటపడింది. ఆ తర్వాతి రోజుల్లో కాళ్లు, తొడ భాగాలు, పుర్రె, మోచేతులు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పాండవ్ నగర్ పోలీసులు.. విచారణ సాగించారు. వరుసగా శరీర భాగాలు దొరికేసరికి.. అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి దర్యాప్తు జరిపారు. దీంతో పూనమ్, దీపక్​ గురించి తెలిసింది. తన భర్త గురించి పూనమ్ ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదని పోలీసులు గుర్తించారు. దీంతో వారిని ప్రశ్నించగా.. తప్పు ఒప్పుకున్నారు. మరోవైపు, డీఎన్​ఏ పరీక్షల కోసం బిహార్​లోని అంజనా దాస్ కుటుంబ సభ్యులను పిలిపించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.