ETV Bharat / bharat

దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత, స్కూళ్లు బంద్- '9ఏళ్లలో కేజ్రీవాల్ చేసిందిదే' - దిల్లీ వాయు కాలుష్యం నాణ్యత

Delhi Air Pollution Today : దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 'తీవ్రస్థాయి'కి చేరుకుంది. దీంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత పరిస్థితిపై బీజేపీ నేతలు కేజ్రీ సర్కార్​పై మండిపడుతున్నారు.

Delhi Air Quality
Delhi Air Quality
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 12:49 PM IST

Delhi Air Pollution Today : దేశ రాజధాని దిల్లీలో మళ్లీ వాయు కాలుష్య తీవ్రత ప్రమాదస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత 'తీవ్రస్థాయి'కి చేరుకుంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డు గణాంకాల ప్రకారం గాలి నాణ్యత సూచీ 346గా నమోదైంది. లోధీ రోడ్‌, జహంగీర్‌పురి, ఆర్కేపురం, ఐజీఐ ఎయిర్‌ పోర్టు టీ3 వద్ద పొగమంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వరుసగా 438, 491, 486, 463గా వాయు నాణ్యత నమోదైంది.

  • #WATCH | The Latest ANI drone camera footage from Jahangirpuri and the industrial area, shot at 11.10 am today, shows the city shrouded in a thick blanket of haze.

    The air quality in Delhi is in 'Severe' category today as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/7Wz5cIMlDC

    — ANI (@ANI) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Delhi Air Quality : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్‌ 62, సెక్టార్‌ 1, సెక్టార్‌ 116 వద్ద గాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఐదు రోజుల పాటు నిర్మాణ పనులు చేపట్టకూడదని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆదేశాలు జారీ చేశారు. వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహన ఇంజిన్‌ ఆపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతోపాటు 1,000 సీఎన్‌జీ ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా దిల్లీలో శుక్రవారం ప్రాథమిక పాఠశాలలకు కేజ్రీవాల్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోధీ రోడ్డులో చెట్లపై దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నీటిని చల్లుతోంది.

  • #WATCH | Latest ANI drone camera footage from Signature Bridge in Delhi shows the city shrouded in a thick blanket of haze.

    The air quality in Delhi is in 'Severe' category today as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/cSWsP3QGRy

'బయటకు వెళ్తే చాలు!'
దిల్లీ వాయుకాలుష్యంపై శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్​ సందీప్​ నాయర్​ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజధానిలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉన్నట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో 20-30 శాతం ఓపీ పెరిగిందని తెలిపారు. బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరిలో కళ్ల ఇన్​ఫెక్షన్​, గొంతులో నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నారు. శరీరంలోకి విషపూరితమైన గాలి వెళ్లినప్పుడు.. ఆ ప్రభావం ప్రతి అవయవం మీద పడుతుందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

  • #WATCH | On air pollution in Delhi, Dr. Sandeep Nayar, Principal Director, Chest and Respiratory Diseases, BLK-Max Super Speciality Hospital, says, "...This is a dangerous level. This is a gas chamber. If you go out, there is irritation in the eyes and pain in the throat of… pic.twitter.com/1RbpGmoU9i

'మేమేం ఆలస్యం చేయడం లేదు'
రాజధానిలో వాయు కాలుష్యంపై తీసుకునే చర్యల విషయంలో తాము ఆలస్యం చేయడం లేదని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్​రాయ్​ తెలిపారు. "కాలుష్యం విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు కమిషన్​ నియమించింది. వారి ఆదేశాల ప్రకారం మేం చర్యలు తీసుకుంటున్నాం. పరిస్థితి తీవ్రంగా మారితే.. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం" అని చెప్పారు.

  • #WATCH | Delhi Environment Minister Gopal Rai says, "We are not delaying (for odd-even). The Supreme Court has given the Commission for Air Quality Management (CAQM) the mandate to take the decision. According to their direction, we are moving our steps. If the situation turns… pic.twitter.com/2VDgN08Smh

'కేజ్రీవాల్​ ప్రభుత్వంలోనే దిల్లీ ఇలా..'
అరవింద్​ కేజ్రీవాల్​లోని నేతృత్వంలోనే దిల్లీ గ్యాస్​ ఛాంబర్​గా మారిందని బీజేపీ నేత షెహజాద్​ పూనావాలా ఆరోపించారు. కాలుష్యాన్ని అరికట్టడానికి సర్కారు చేసిందేం లేదని ఎద్దేవా చేశారు. రాజధానిలో ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతోందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విమర్శించారు. "పిల్లలు ఇళ్ల నుంచి బయటకు వస్తే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. దిల్లీలో నివసించే వారి సగటు జీవితకాలం 12 ఏళ్లు తగ్గిపోయింది. 9ఏళ్లలో కేజ్రీవాల్​ చేసిన పని ఇదే. ఆయన అవినీతికి పాల్పడి దేశమంతటా తిరుగుతున్నారు" అని మనోజ్ మండిపడ్డారు.

  • #WATCH | On air pollution in Delhi, BJP leader Shehzad Poonawalla says, "...Delhi has become a gas chamber under Arvind Kejriwal... He has ensured that AQI levels are at their highest in the last four to five years. He has done nothing to tackle pollution; he used to blame… pic.twitter.com/FCjv5LxBTF

  • #WATCH | Delhi | BJP MP Manoj Tiwari says, "Breathing in Delhi is becoming tough. Children are under the threat of suffering lung damage if they are stepping out of their houses. The average life span of people living in Delhi has been reduced by 12 years. This is what Arvind… pic.twitter.com/6FHzMhBYLI

Delhi Air Pollution Today : దిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.