ETV Bharat / bharat

'లద్దాఖ్​ను యూటీగా మార్చటానికి కారణమదే'​ - రాజ్​నాథ్​ సింగ్​ లద్దాఖ్​ పర్యటన

లద్దాఖ్​ పర్యటనలో భాగంగా 63 ఇన్​ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో రాజకీయ ప్రక్రియ ప్రారంభం కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే లద్దాఖ్​ ప్రజలతో మాట్లాడతారని చెప్పారు. లద్దాఖ్​ను యూటీగా మార్చటం వెనకున్న కారణాలను వివరించారు.

Rajnath singh, Defence minister
రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి
author img

By

Published : Jun 28, 2021, 11:27 AM IST

Updated : Jun 28, 2021, 1:13 PM IST

మూడు రోజుల లద్దాఖ్ పర్యటనలో భాగంగా సోమవారం.. సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ(బీఆర్​ఓ) నిర్మించిన 63ఇన్​ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. లద్దాఖ్​ అభివృద్ధిపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

"దేశాభివృద్ధిలో కనెక్టివిటికీ చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలోని చాలా ప్రాంతాలను కలపటంలో బీఆర్​ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తీవ్రవాదం, సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో వెనకబడటం లద్దాఖ్​ను కేంద్ర పాలిత ప్రాంతం చేయటం వెనకున్న కారణాల్లో ముఖ్యమైనవి. యూటీగా మారిన తర్వాత ఉగ్రవాద చర్యలు తగ్గాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు, మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కేంద్రం చాలా చేస్తోంది. "

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ ప్రాంతాల్లో రాజకీయ ప్రక్రియ ప్రారంభం కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని, ఇప్పటికే జమ్ముకశ్మీర్​ నేతలతో ప్రధాని మాట్లాడినట్లు గుర్తు చేశారు రాజ్​నథ్​. త్వరలోనే.. లద్దాఖ్​ ప్రజలతో మాట్లాడతారని తెలిపారు.

ఆ తర్వాత లేహ్​లోని బలగాలను కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. సైనికులతో కలిసి అల్పాహారం సేవించారు. వారితో కాసేపు ముచ్చటించి.. ఫొటో దిగారు.

Defence Minister Rajnath Singh
జవాన్లతో ముచ్చటిస్తోన్న రాజ్​నాథ్​
Defence Minister Rajnath Singh
జవాన్లతో మాట్లాడుతున్న రక్షణ మంత్రి
Defence Minister Rajnath Singh
సైనికులతో రక్షణ మంత్రి

ఇదీ చూడండి: 'సైనికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం'

Last Updated : Jun 28, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.