Dead Body Found MLA Home : ఎమ్మెల్యే ఇంట్లోని మూసివేసిన గదిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ ఘటన బిహార్‌లోని నవాదాలో జరగింది. హిసువా ఎమ్మెల్యే నీతు కుమారి ఇంట్లో నరహట్కు చెందిన పీయూష్ అనే యువకుడి మృతదేహం లభించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇది జరిగింది
నరహట్ ప్రాంతానికి చెందిన టున్‌టున్ సింగ్ కుమారుడు పీయూష్‌ను.. ఎమ్మెల్యే నీతు కుమారి బావ కుమారుడు గోలు పిలిచాడు. ఎమ్మెల్యే నివాసంలో పార్టీ చేసుకుందామని చికెన్, బ్రెడ్ తీసుకుని రమ్మని చెప్పాడు. దీంతో సాయంత్రం 7 గంటలకు ఎమ్మెల్యే నీతు కుమారి ఇంటికి వెళ్లాడు పీయూష్. ఇద్దరు మద్యం తాగుతున్న క్రమంలోనే గోలు, పీయూష్ మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన గోలు.. పీయూష్‌ను హత్య చేసి మూసివేసిన గదిలో వేశాడు.
మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలు దాటినా.. కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల భయపడిన పీయూష్ కుటుంబ సభ్యులు.. గోలు ఇంటికి వెళ్లి వెతకగా.. ఓ గదిలో పీయూష్ మృతదేహం లభ్యమైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోలు సింగ్‌ను మాజీ మంత్రి ఆదిత్య సింగ్ మనవడు కాగా.. హిసువా ఎమ్మెల్యే నీతు సింగ్‌కు సమీప బంధువు.
"హత్య జరిగిన సమయంలో ఎమ్మెల్యే నీతు కుమారితో సహా వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. కేవలం నీతు కుమారి బావ కుమారుడు గోలు మాత్రమే ఉన్నాడు. గోలు, పీయూష్ ఇద్దరూ దూరపు బంధువులు అవుతారని తెలిసింది. అయితే, పీయూష్‌ను ఇంటికి రమ్మని గోలు పిలిచాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. పీయూష్ ఇంట్లో శవమై కనిపించాడు. ప్రస్తుతం నిందితుడు గోలు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం."
--అంబరీశ్ రాహుల్, ఎస్పీ
Family Mass Suicide : ఒకే కుటుంబంలో ఏడుగురు సామూహిక ఆత్మహత్య.. ఆరుగురికి విషం ఇచ్చి.. ఆపై..
Lady Constable Suicide : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. శరీరంపై 500 గాయాల మరకలు.. ఏం జరిగింది?