ETV Bharat / bharat

ముందే అలర్ట్​ అయిన భారత్​- అందుకే వారంతా సేఫ్​! - అఫ్గాన్ సంక్షోభం

అఫ్గానిస్థాన్​లోని మజర్​-ఎ-షరీఫ్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించే రెండు రోజుల ముందే అక్కడి నుంచి భారత కాన్సులేట్ సిబ్బందిని స్వదేశానికి తీసుకొచ్చింది భారత వాయుసేన. కాందహార్​లోనూ కాన్సులేట్ సిబ్బందిని ఆక్రమణలకు ముందే కాబుల్​కు తరలించినట్లు తెలుస్తోంది.

అఫ్గానిస్థాన్
Afghan crisis
author img

By

Published : Aug 19, 2021, 5:09 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆక్రమణలు జరుగుతున్న సమయంలోనే మజర్​-ఎ-షరీఫ్​ నగరం నుంచి సుమారు 50 మంది భారత కాన్సులేట్ అధికారులను స్వదేశానికి తరలించింది భారత వాయుసేన. ఇది జరిగిన రెండు రోజులకే ఆ నగరాన్ని ఆక్రమించారు తాలిబన్లు.

అఫ్గాన్​లోని భారత కాన్సులేట్ సహా ఐటీబీపీ అధికారులను ఈ నెల 11, 12 తేదీల్లో వాయుసేన ప్రత్యేక విమానాల ద్వారా భారత్​కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాందహార్​లోని కాన్సులేట్​ సిబ్బందిని కూడా ఆ నగరాన్ని ముష్కరమూకలు ముట్టడించడానికి ముందే కాబుల్​ రాయబార కార్యాలయానికి తరలించింది కేంద్ర ప్రభుత్వం. కాబుల్​ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత సుమారు 180 మంది అధికారులను భారత్​కు రప్పించింది.

ఇప్పటికీ అఫ్గాన్​లో చిక్కుకుపోయి ఉన్న భారత పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత వాయుసేన, వాణిజ్య విమానాలు వేచిచూస్తున్నాయి. కాబుల్​లో మన విమానాల ల్యాండింగ్​ కోసం స్థానిక అధికారులు, అమెరికా భద్రత దళాల అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇదీ చూడండి: కాబుల్​ నుంచి స్వదేశానికి భారతీయులు- ఎంబసీ సేవలు యథాతథం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.