ETV Bharat / bharat

'త్వరలోనే దేశానికి 'మోదీ' పేరు!'

author img

By

Published : Mar 8, 2021, 6:24 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. దేశానికి మోదీ పేరు పెట్టే రోజు దగ్గరలోని ఉందని ధ్వజమెత్తారు దీదీ. మొతేరా మైదానానికి మోదీ పెట్టడం సహా కొవిడ్​ వ్యాక్సినేషన్​ ధ్రువపత్రాలపై మోదీ ఫొటో ముద్రించడంపై మండిపడిన మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

Day not far when country will be named after Modi: Mamata
'దేశానికి మోదీ పేరు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది'

ప్రధాని నరేంద్ర మోదీ మోదీ.. బంగాల్​లోని అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. దేశానికి మోదీ పేరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని ఘాటుగా విమర్శించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కోల్​కతాలో ర్యాలీ నిర్వహించిన మమత.. ఈ వ్యాఖ్యలు చేశారు.

"అసత్యాలు, అబద్ధాలను వ్యాపింప చేయడానికి ఎన్నికల సమయంలో వారు(భాజపా నేతలు) బంగాల్​కు వస్తారు. మహిళల భద్రత కోసం ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే భాజపా పాలక రాష్ట్రాల్లో మహిళల పరిస్థితి ఏంటి? మోదీకి ప్రియమైన గుజరాత్​లో అతివల పరిస్థితి ఎలా ఉంది?

అహ్మదాబాద్​లోని మొతేరా స్టేడియానికి తన(మోదీ) పేరు పెట్టుకున్నారు. కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ ధ్రువపత్రాల్లో తన ఫొటోను ముద్రించుకున్నారు. దేశానికీ ఆయన పేరు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది."

- మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి

బంగాల్​లో మహిళలకు భద్రత లేదన్న ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు మమత. తానే మూడోసారి అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: దీదీకి షాక్- భాజపాలోకి ఐదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.