ETV Bharat / bharat

ఆస్తి విషయంలో కొడుకుతో గొడవ.. మంచంపై కోర్టు​ విచారణకు హాజరైన మహిళ - చామరాజనగర్​ లేటెస్ట్ న్యూస్​

కర్ణాటకలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కోర్టులో విచారణ కోసం తల్లిని మంచంపై తీసుకువెళ్లిందో కూమార్తె. కన్న కొడుకే మోసం చేయడం వల్ల ఆమె కోర్టును ఆశ్రయించింది. అసలు ఏం జరిగిందంటే..?

daughter bring mother to court in karnataka

author img

By

Published : Dec 16, 2022, 4:35 PM IST

Updated : Dec 16, 2022, 5:00 PM IST

మంచంపై కోర్ట్​ విచారణకు హాజరైన మహిళ

కర్ణాటకలో ఓ మహిళ కదలలేని స్థితిలో.. మంచంపైనే కోర్టు విచారణకు హాజరైంది. ఆస్తి విషయంలో కన్నకొడుకే మోసం చేయడం వల్ల ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు వారు వద్దని చెప్పినా సరే.. బాధితురాలు తన బాధను చెప్పుకోవడానికి కుమార్తె, బంధువుల సహాయంతో విచారణకు హాజరైంది.

అసలు ఏం జరిగిందంటే..?
చామరాజనగర్​ జిల్లా కొల్లెగల ప్రాంతంలోని ముంతాజ్​ బేగం అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు, ఆరుగురు కొడుకులు ఉన్నారు. ముంతాజ్​ భర్త నిసార్​ అహ్మద్​ కొంతకాలం క్రితం తన పేరుపై 3.2 ఎకరాల భూమిని కొన్నారు. నిసార్​ అహ్మద్​ మృతి చెందారు. అయితే ఆ భూమిని చిన్న కొడుకు అబ్దుల్​ రజాక్​.. హజ్​ యాత్రకు పాస్​పోర్ట్​ ఇప్పిస్తానని చెప్పి తన పేరుపై మార్చుకున్నాడు. ముంతాజ్​ పేరుపై లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. దాని గురించి అడిగితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు చిన్న కొడుకుపై ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007 కింద దరఖాస్తు చేసింది.

అనారోగ్యం కారణంగా ముంతాజ్​ బేగం రెండు నెలలుగా అసిస్టెంట్‌ కమిషనర్‌ కోర్టులో​ విచారణకు హాజరుకాలేదు. దీంతో గురువారం జరిగే విచారణకు హాజరుకావాలని.. ముంతాజ్​కు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. అయితే అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ముంతాజ్​ను ఆమె కుమార్తె నూర్​ ఆయేషా.. బంధువుల సహాయంతో కోర్టుకు తీసుకువెళ్లింది.

"ఈ పరిస్థితిలో ఆమె విచారణకు హాజరుకాకూడదని ముందేగానే చెప్పాం. ముంతాజ్ బేగం అనారోగ్యంతో మంచంపై ఉన్న ఫొటోను మా సిబ్బందికి ముందుగానే పంపారు. అటువంటి పరిస్థితిలో ఆమెను విచారణకు తీసుకురావద్దని చెప్పాము. అయినా సరే.. కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొచ్చారు" అని అసిస్టెంట్ కమిషనర్ గీతా హుడా తెలిపారు.

గతంలో బెళగావికి చెందిన ఓ మహిళ ఐసీయూ నుంచి అంబులెన్స్​లో.. సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి వచ్చింది. ఆమె కూడా ఆస్తి పంపకాల విషయంలోనే హజరుకావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Dec 16, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.