ETV Bharat / bharat

పదేళ్ల కుమార్తెపై పైశాచికం- తండ్రి అరెస్ట్​ - daughter raped by father in rajasthan

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఓ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. భార్యతో గొడవపడి దూరంగా ఉంటున్న ఆ వ్యక్తి.. తన పదేళ్ల కుమార్తెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సుమారు నాలుగు నెలలు పాటు ఈ వ్యవహారం నడిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Daily wage worker held for raping minor daughter in Rajasthan
కుమార్తెపై పైశాచికం-తండ్రి అరెస్ట్​
author img

By

Published : Jan 23, 2021, 7:25 PM IST

Updated : Jan 24, 2021, 10:25 AM IST

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి తన 10 సంవత్సరాల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సుమారు నాలుగు నెలలుగా ఈ అఘాయిత్యానికి ఒడికడుతూ వచ్చిన తండ్రిని రాజస్థాన్​లోని దాబి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని స్థానిక కోర్టులో హజరుపరచనున్నారు.

ఇదీ జరిగింది..

నిందితుడు పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్​ నుంచి రాజస్థాన్​లోని దాబీకి తరలివచ్చాడు. కుటుంబ కలహాలతో భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు. తనతో ఉన్న 10ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందువల్ల చిన్నారికి పొత్తి కడుపులో భరించలేని నొప్పి కలిగింది. దీంతో బాలిక చుట్టుపక్కల వారిని ఆశ్రయించింది. ఈక్రమంలో స్థానికులకు అనుమానం రాగా గ్రామ సర్పంచ్​కు.. జరిగింది వివరించారు. దీనిపై దాబీ పోలీసులకు సర్పంచ్​ ఫిర్యాదు చేశారు. కీచక తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు, చిన్నారిని.. బాలికల సంరక్షణ గృహానికి తరలించారు.

బాలికకు మైనర్​ల వేధింపులు

ఉత్తరప్రదేశ్​ బండాలో ఏడేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు లైంగికంగా వేధిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గురువారం ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడిన వారి వయసు 12-14ఏళ్లు ఉంటాయని చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: లోయలో పడిన వాహనం- ఆరుగురు దుర్మరణం

Last Updated : Jan 24, 2021, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.