దుబాయి, షార్జా నుంచి ప్రత్యేక విమానాల్లో చెన్నైకి అక్రమంగా తీసుకొచ్చిన రూ. 2.53కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిందితులను అరెస్ట్ చేశారు అధికారులు.
ఇలా దొరికారు..
చెన్నై విమానాశ్రయానికి దుబాయి, షార్జా నగరాల నుంచి ఆదివారం రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయని కస్టమ్స్ విభాగం పేర్కొంది. అందులో ప్రయాణికులను తనిఖీ చేసి.. ఏడుగురు అనుమానితులను పట్టుకున్నారు. వారిపై ప్రత్యేక సోదాలు నిర్వహించగా.. ముడి బంగారంతో పాటు తల విగ్గు, లోదుస్తులు, సాక్సుల్లో దాచిన పసిడి పేస్టును గుర్తించారు. మొత్తం 5.55కిలోల బంగారం బయటపడగా.. దీని విలువ రూ. 2.53 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేశారు. అంతేకాకుండా.. చెన్నై నుంచి షార్జాకు తరలించేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు.



ఇదీ చదవండి: మహిళ లోదుస్తుల్లో రూ.కోటి విలువైన బంగారం