Covishield efficiency: కొవిడ్ రెండో విడత ఉద్ధృతి కొనసాగిన ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల్లో ఆ వ్యాక్సిన్ ప్రభావశీలత 63 శాతం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనలో ఈ అధ్యయానాన్ని జోడించింది.
ఆ వివరాలు 'లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కొవిడ్ బారినపడిన 2,379 మందితో పాటు కరోనా నుంచి కోలుకున్న 1,981 మందిపై ఈ పరిశోధన జరిపినట్లు పేర్కొన్నారు.
ట్రాన్స్‌నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో వివిధ సంస్థలకు చెందిన భారత పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
ఇదీ చూడండి: Covaxin Omicron: 'కొవాగ్జిన్‌ను ఒమిక్రాన్‌పై పరిశోధిస్తున్నాం'