ETV Bharat / bharat

88.5 లక్షల మందికి టీకా పంపిణీ: కేంద్రం

కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 88.5 లక్షల మందికిపైగా టీకా​ డోసులు పంపిణీ చేసింది కేంద్రం. ఇవాళ ఒక్క రోజే 1,34,691 మందికి వ్యాక్సిన్​ ఇచ్చినట్లు పేర్కొంది

author img

By

Published : Feb 16, 2021, 9:28 PM IST

Covid vaccine was given to 1,90,665 people as part of the second dose vaccination process
88.5 లక్షల మందికి టీకా పంపిణీ: కేంద్రం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 88.5 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. మొత్తం 88,57,341 మందికి 1,90,665 సెషన్స్‌లో వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్లు వెల్లడించింది. వీరిలో 61,29,745 మంది ఆరోగ్య కార్యకర్తలకు తొలి విడత టీకాలు ఇవ్వగా.. 2,16,339 మందికి రెండో విడత టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇవాళ ఒక్క రోజే 1,34,691 మందికి వ్యాక్సిన్​ను ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. వీరిలో 78,643 మందికి తొలివిడత, 56,048 మందికి రెండో విడత టీకాలు ఇచ్చినట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 3,87,236 మందికి కరోనా టీకాలు ఇవ్వగా.. వారిలో 3,64,983 మందికి తొలిదఫా.. 22,253 మందికి రెండో దఫా టీకాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 2,97,016 మందికి టీకాలు వేయగా.. వారిలో 2,79,330 మందికి తొలిదఫా, 17,686 మందికి రెండో దఫా టీకాలు ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: ప్రపంచ ఆరోగ్య సంస్థతో 'ఆయుష్​' కీలక ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.