Corona cases in India: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. 34,113 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 346 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,930 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.12 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.68 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,26,65,534
- మొత్తం మరణాలు: 5,09,011
- యాక్టివ్ కేసులు: 4,78,882
- మొత్తం కోలుకున్నవారు: 4,16,77,641
దేశంలో కొత్తగా 11,66,993 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,95,87,490 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona Cases
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 14 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 5,461 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 41,20,79,751గా ఉండగా.. మరణాల సంఖ్య 58,33,915 కు చేరింది.
- రష్యాలో మరో 1.97 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 706 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో ఒక్కరోజే 1.08 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 47 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 86 వేల మందికి కరోనా సోకింది. 107 మంది మరణించారు.
- టర్కీలో తాజాగా 73 వేల కేసులు బయటపడగా.. 276 మంది బలయ్యారు.
- జపాన్‌లో ఒక్కరోజే 67 వేలకు పైగా మందికి వైరస్ సోకింది. మరో 143 మంది మృతిచెందారు.
ఇదీ చూడండి :కేరళలో తగ్గిన కొవిడ్ కేసులు.. అక్కడ రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత