Covid Cases in India: భారత్‌లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 3.42 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 5,01,114
- యాక్టివ్ కేసులు: 13,31,648
- మొత్తం కోలుకున్నవారు: 4,02,47,902
దేశంలో కొత్తగా 47,53,081 మందికి టీకా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,68,98,17,199 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 29 లక్షల మందికి కరోనా సోకింది. 11,284 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,743,109 కు పెరిగింది.
- US Corona Cases: అమెరికాలో కొత్తగా 2.81 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,619 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2.41 లక్షలకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. మరో 355 మంది చనిపోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 2.19 లక్షల మందికి వైరస్ సోకగా.. 1,068 మంది చనిపోయారు.
- రష్యాలో తాజాగా 1.68 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 682 మంది బలయ్యారు.
- జర్మనీలో ఒక్కరోజే దాదాపు 2.35 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 165 మంది మృతి చెందారు.
ఇవీ చూడండి:వారికి మాస్కు అక్కర్లేదు- ఫుల్ కెపాసిటీతో థియేటర్లు రీఓపెన్