ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. తగ్గిన మరణాలు - ఈరోజు కేసులు

Coronavirus Update India: దేశంలో ఒక్కరోజే 2,364 మందికి వైరస్​ సోకింది. మరో 10 మంది చనిపోయారు. కోలుకున్నవారి శాతం 98.75కి చేరింది. మరోవైపు ఉత్తరకొరియాలో కరోనా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉంది. 2,62,270 మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

Covid cases in india
Covid cases in india
author img

By

Published : May 19, 2022, 9:37 AM IST

Covid cases in india: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,364కేసులు వెలుగుచూశాయి. మరో 10 మంది చనిపోయారు. ఒక్కరోజే 2,582 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్​ కేసులు 15,419 కు చేరాయి. పాజిటివీటి రేటు 0.50గా నమోదైంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,129,563
  • మొత్తం మరణాలు: 5,24,303
  • యాక్టివ్​ కేసులు: 15,419
  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,89,841

Vaccination India: దేశవ్యాప్తంగా బుధవారం 13,71,603 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,91,79,96,905కు చేరింది. ఒక్కరోజే 4,77,570 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 7,71,145 మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1,592 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,46,99,321కు చేరింది. మరణాల సంఖ్య 62,94,661కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,44,35,368గా ఉంది.

  • అమెరికాలో కొత్తగా 1,03,958 కేసులు బయటపడగా.. 273 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 64,582 మందికి కరోనా సోకగా.. 166 మంది మృతిచెందారు.
  • ఆస్ట్రేలియాలో మరో 56,259కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 53 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 30,408 మందికి వైరస్​ సోకింది. 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో 29,995 కొవిడ్​ కేసులు నమోదుకాగా.. 80 మంది మహమ్మారికి బలయ్యారు.

కొరియాలో తగ్గని ఉద్ధృతి: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. తాజాగా ‌2,62,270 మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు గుర్తించామని.. కరోనా బారినపడి ఒకరు మృతిచెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 63కు చేరింది. ప్రస్తుతం దేశంలో 7,40,160 మంది క్వారైంటైన్​లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా బాధితులను గుర్తించడానికి లక్ష మంది ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపింది.

ఇదీ చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొరియాలో తగ్గని ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.