కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. కొవిడ్ మహమ్మారిని నియంత్రించటంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ అహంకార విధానాల వల్లే దేశంలో.. వైరస్ ధాటికి ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర అసమర్థ పాలన వల్లే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
వైరస్‌పై నియంత్రణే లేదు. వ్యాక్సిన్లు సరిపడా లేవు. ఉద్యోగ అవకాశాలు లేవు. దేశంలో రైతులు, కార్మికుల గోడు పట్టించుకోవట్లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రక్షణ లేదు. కనీసం సామాన్య మానవునికి అందించాల్సినవేవీ అందట్లేదు.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఇదీ చదవండి: దేశ్‌ముఖ్ వ్యక్తిగత సలహాదార్లకు సీబీఐ సమన్లు