ETV Bharat / bharat

ఏడాదికి పైగా మార్చురీలోనే కరోనా మృతదేహాలు- కుళ్లిపోయే స్థితిలో...

కరోనాతో చనిపోయిన ఓ ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాదికి పైగా ఓ ఆస్పత్రిలోని మార్చురీలో కుళ్లిపోతూ ఉన్నాయి. ఈ హృదయ విదారకర ఘటన కర్ణాటకలో(Karnataka covid dead bodies) వెలుగు చూసింది.

COVID-19  dead bodies Karnataka
కర్ణాటకలో కరోనా మృతదేహాలు
author img

By

Published : Nov 29, 2021, 5:49 PM IST

కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కొవిడ్​తో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాదికిపైగా ఓ ఆస్పత్రిలోని మార్చురీలో కుళ్లిపోయే స్థితిలో ఉండిపోయాయి.

అప్పటి నుంచి...

కరోనా బాధితులైన 40 ఏళ్ల మహిళ, ఓ 50 ఏళ్ల పురుషుడు.. బెంగళూరు రాజాజీనగర్​లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్(ఈఎస్​ఐసీ) ఆస్పత్రిలో గతేడాది జూన్​లో చేరారు. అదే ఏడాది జులైలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వారు మరణించారు. అప్పటి నుంచి వారి మృతదేహాలు ఆదే ఆస్పత్రిలో(Esi hopital dead bodies) ఉండిపోయాయి. ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వర్తించకుండా అలాగే వదిలేశారు.

'కఠినంగా శిక్షించాలి'

ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు జరపాలని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక కార్మిక శాఖ మంత్రి ఏ శివరామ్ హెబ్బార్​కు భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్​ సురేష్​ కుమార్ లేఖ రాశారు.

"కొవిడ్ మృతదేహాల విషయంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక, ఈఎస్​ఐ ఆస్పత్రి అధికారుల పాత్ర శోచనీయం. ఈ విషయంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను రూపొందించాలి. ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దురదృష్టకర ఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు."

-ఎస్​ సురేశ్ కుమార్​, భాజపా ఎమ్మెల్యే.

"కరోనా విజృంభణ సమయంలో హృదయాలను కలచివేసే ఘటనలను ఎన్నింటినో చూశాం కానీ, ఈఎస్​ఐ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన మాత్రం అత్యంత దురదృష్టకరమైనది. బాధ్యతారాహిత్యం, అమానవీయ ప్రవర్తనకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది" అని సురేశ్​ కుమార్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: నగరంలో 'చిరుత' ఫోబియా.. కుక్కను చూసినా భయంతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.