ETV Bharat / bharat

వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే? - కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్​

Covid-19 Vaccination: దేశంలో 2021 జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్‌ డోసులను అందిస్తుండగా.. భారత్‌ కూడా ప్రికాషన్‌ డోసులను వడివడిగా వేస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్‌ పక్రియ మొదలై ఏడాది పూర్తవుతున్న  నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా తాజా పరిస్థితులను పరిశీలిస్తే..

Covid-19 Vaccination
వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు
author img

By

Published : Jan 15, 2022, 7:14 AM IST

Covid-19 Vaccination: కరోనాపై పోరులో మానవాళి అమ్ములపొదిలోని తిరుగులేని పాశుపతాస్త్రం- టీకా! ఉప్పెనలా విరుచుకుపడ్డ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను పరిరక్షించేందుకు అనేకమంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు రాత్రింబవళ్లు శ్రమించి నెలల వ్యవధిలోనే అభివృద్ధి చేసిన పలు వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయి. కొవిడ్‌ బారినపడ్డవారిలో తీవ్ర అనారోగ్యం, మరణం ముప్పులను అవి గణనీయంగా తగ్గిస్తున్నాయి. మహమ్మారిపై భారత్‌ పోరాటంలోనూ వాటిది కీలక పాత్ర. దేశంలో 2021 జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఒక్కరోజులో కోటికి పైగా డోసులు వేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్‌ డోసులను అందిస్తుండగా.. భారత్‌ కూడా ప్రికాషన్‌ డోసులను వడివడిగా వేస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్‌ పక్రియ మొదలై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా తాజా పరిస్థితులను పరిశీలిస్తే..

Covid-19 Vaccination
ప్రపంచదేశాల్లో ఇలా..
Covid-19 Vaccination
భారత్​లో కరోనా వ్యాక్సినేషన్​ పంపిణీ

ఏ టీకా ఎన్ని దేశాల్లో?

Covid-19 Vaccination Worldwide: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డజనుకు పైగానే కొవిడ్‌ టీకాలు వినియోగంలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అత్యధిక దేశాల్లో ఉపయోగిస్తున్నారు. మన దేశంలోని డోసుల్లో కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా), దేశీయ దిగ్గజ ఔషధ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌లది సింహభాగం.

ఇదీ చదవండి: మహారాష్ట్రలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 43,211 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.