ETV Bharat / bharat

కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా? - కరోనా మరణాల లెక్కల్లో వాస్తవమెంత?

దేశంలో రోజుకు రెండు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వెయ్యి మందికి పైగా వైరస్​కు బలవుతున్నారు. అయితే.. ఇవన్నీ అధికారిక లెక్కల ప్రకారం. వాస్తవ సంఖ్య వేరేగా ఉంటోంది! వైరస్ మరణాలను ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఈటీవీ భారత్ రియాలిటీ చెక్ చేపట్టింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి!

covid deaths govt data
కరోనా మరణాలపై ప్రభుత్వ గణాంకాల్లో తేడా
author img

By

Published : Apr 17, 2021, 1:39 PM IST

రెండో దశ కరోనా వ్యాప్తి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు మించి నమోదవుతుండటం.. సామాన్యులతో పాటు ప్రభుత్వాలనూ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి 24 గంటలు గడిస్తే.. ఎన్ని కేసులు వస్తాయోనన్న ఆందోళనా సర్వత్రా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఒక్కరోజే 1,341 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 2,34,692 మంది కరోనా బారినపడ్డారు.

శ్మశానాల్లో ఖననానికీ స్థలం సరిపోనంతగా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇక్కడే.. అనుమానాలకు తావిచ్చేలా ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వాలు వెల్లడిస్తున్న గణాంకాలు ఎంతవరకు వాస్తవమనే అంశం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై వాస్తవాలు శోధించేందుకు 'ఈటీవీ భారత్' స్వయంగా రంగంలోకి దిగింది. అసలు మరణాలు, ప్రభుత్వ గణాంకాల మధ్య సారూప్యత లేకపోవడంపై పరిశీలన చేపట్టింది. ఈ రియాలిటీ చెక్​లో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

మధ్యప్రదేశ్​లో..

గురువారం 10,166 కేసులు వెలుగులోకి వచ్చినట్లు మధ్యప్రదేశ్​ ప్రభుత్వం శుక్రవారం తన బులెటిన్​లో వెల్లడించింది. 53 మంది మరణించారని తెలిపింది. ఇదే విధంగా 47 మంది చనిపోయారని ఏప్రిల్ 12న తన ప్రకటనలో వివరించింది. కానీ ఆ రోజు.. రెండు జిల్లాల్లోనే 95 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. భోపాల్​లో 58, ఛింద్వాడాలో 37 మందిని ఖననం చేశారు. ఈటీవీ భారత్ సందర్శించని మరో 50 జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయంపై ఆందోళన నెలకొంది. రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేస్తున్న గణాంకాలపై అనుమానాలు పెంచుతోంది.

madhya pradesh covid deaths mismatch
మధ్యప్రదేశ్​లో ఇలా..

దిల్లీ

కరోనా మహమ్మారి వ్యాప్తి రాజధాని నగరాన్నీ అస్తవ్యస్తం చేస్తోంది. శుక్రవారం 24 గంటల వ్యవధిలో 16,699 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 54,309 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏప్రిల్ 12న 72 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43 మృతదేహాలు, న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 శవాలకు అంత్యక్రియలు జరిగాయి.

delhi covid deaths
దిల్లీ గణాంకాలు

ఛత్తీస్​గఢ్

ఛత్తీస్​గఢ్​లో శుక్రవారం 15,256 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 105 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ, మధ్యప్రదేశ్ గణాంకాల్లాగే.. ఇక్కడా ప్రభుత్వం విడుదల చేస్తున్న మృతుల సంఖ్య అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్రంలోని దుర్గ్ నగరంలో వ్యాప్తి అధికంగా ఉంది. వైరస్ కట్టడికి ఇక్కడ ఆంక్షలు అమలవుతున్నాయి. ఏప్రిల్ 13న రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 73 మంది మరణిస్తే.. దుర్గ్​లోని ఒక్క శ్మశానవాటికలోనే 61 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

chattisgarh covid deaths mismatch
దుర్గ్​ జిల్లాలో కరోనా మరణాలు, శ్మశానాల్లో ఖననాలు

ప్రభుత్వాలకు ప్రశ్నలు

శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించిన ప్రతి మృతదేహం.. కరోనా బాధితులదే కాకపోవచ్చన్న విషయం వాస్తవమే. కానీ, ఇక్కడ ప్రభుత్వాలు విడుదల చేస్తున్న గణాంకాలే అనుమానాస్పదంగా ఉన్నాయి. కరోనా వ్యాప్తి అత్యంత వేగంగా, తీవ్రంగా ఉన్నప్పటికీ.. గణాంకాల దగ్గరకు వచ్చే సరికి ఆ స్థాయిలో కనిపించకపోవడం ఆందోళనకరంగా మారింది. అసలు.. మరణాల సంఖ్యలో ఎందుకు తేడా ఉంటోంది?, చనిపోయినవారి సంఖ్యను ప్రజలకు తెలియనీయకుండా ఎందుకు దాస్తున్నారు? శ్మశాన నిర్వాహకులు, ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయంలో లోపాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సి ఉంది.

చేయాల్సిందిదే!

కరోనా కేసులు, మరణాలను దాచినంత మాత్రాన.. వైరస్​ను కట్టడి చేయడం సాధ్యం కాదు. వాటిని గుర్తించి, సరైన చికిత్స అందిస్తేనే.. మరణాలను అదుపు చేయొచ్చు. పరీక్షల సంఖ్య పెంచి, ప్రాథమిక కాంటాక్టులను త్వరితగతిన గుర్తించి చికిత్స అందిస్తే కరోనా కట్టడి సాధ్యమవుతుంది. మహమ్మారి నియంత్రణకు మెరుగైన పద్ధతిగా భావిస్తున్న 'టెస్ట్, ట్రేస్, ట్రీట్' విధానం పగడ్బందీగా చేపట్టి కొవిడ్​పై బహుముఖ పోరు సాగించడమే ప్రభుత్వాల కర్తవ్యం కావాలి.

ఇదీ చదవండి: మరో 100రోజుల వరకు కరోనా ముప్పు: వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.