దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతోంది. నాలుగో రోజూ టీకాల సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి 1,77,368 మందికి టీకా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు టీకా స్వీకరించిన వారి సంఖ్య 6,31,417కు చేరిందని తెలిపింది.
టీకా అందించిన తర్వాత ప్రతికూల ప్రభావాలు తలెత్తిన కేసులు అతి స్వల్పంగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం తొమ్మిది మందిలో దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపింది. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు పేర్కొంది. ఇద్దరు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని, మిగిలినవారు డిశ్ఛార్జి అయ్యారని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'యాక్టివ్ కేసులకన్నా టీకా తీసుకున్నవారే అధికం'