ETV Bharat / bharat

మనవడిపై తాత లైంగిక దాడి.. 73 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు - లైంగిక వేధింపులు

Sexual Assault of Grandson: మనవడిపై ఆమానుషంగా లైగింగ వేధింపులకు పాల్పడిన తాతను ఎట్టకేలకు దోషిగా తేల్చింది కేరళలోని ఓ సెషన్స్​ కోర్టు. అతడికి 73 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఉదంతంలో ఝార్ఖండ్​లో ఐదేళ్ల చిన్నారిని రేప్​ చేసి, రాళ్లతో కొట్టి హతమార్చాడు ఓ కిరాతకుడు.

POCSO
sexual assault of grandson
author img

By

Published : Mar 22, 2022, 7:18 AM IST

Sexual Assault of Grandson: మనవడిపై లైంగిక వేధింపులు పాల్పడిన కేసులో 64 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చింది కేరళలోని ఓ సెషన్స్​ కోర్టు. 2019లో ఏడేళ్ల తన మనవడిపై పాల్పడిన అఘాయిత్యానికి గానూ అతడికి పలు సెక్షన్​ల కింద 73 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడిపై ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని.. అతడు 20ఏళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని ప్రత్యేక జడ్జి తీర్పు చెప్పారు.

ఇవీ కేసులు..

పిల్లలపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడటం, 12ఏళ్లలోపు మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటం, మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటం.. ఈ మూడు కేసుల్లో 20ఏళ్ల చొప్పున మొత్తం 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. దాంతో పాటే అసహజ సెక్స్​ నేరానికి 10 ఏళ్లు, జువైనల్ జస్టిస్ చట్టం కింద పిల్లల పట్ల క్రూరత్వానికి మరో మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

ఏం జరిగిందంటే..?

మనవడిపై తాత లైంగిక దాడికి పాల్పడుతుండగా అతడి నాన్నమ్మ చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2019 నవంబర్​లో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కొద్ది నెలలుగా తనపై తాత లైంగిక దాడి చేస్తున్నట్లు బాధిత బాలుడు కూడా పోలీసులకు తెలిపాడు.

అయితే దర్యాప్తులో మాత్రం బాలుడి నాన్నమ్మ.. నిందితుడైన తన భర్తతో ఉన్న వ్యక్తిగత గొడవల కారణంగా ఈ మేరకు ఫిర్యాదు చేసిందని.. బాలుడి తండ్రే పేర్కొనడం గమనార్హం. దీంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన కోర్టు.. సోమవారం నిందితుడిని దోషిగా తేల్చింది.

ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం

ఝార్ఖండ్​లో మరో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికను అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు.

ఇదీ జరిగింది..

చైబసలోని ఖేరియర్​ గ్రామంలో తన ఇంటి ముందు ఆడుకున్న ఐదేళ్ల చిన్నారిని.. బిస్కెట్లు కొనిస్తానంటూ పొదళ్లోకి తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం రాళ్లతో ఆమె ముఖంపై దారుణంగా కొట్టి, హతమార్చాడు.

స్థానికుల సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: మతి స్థిమితంలేని 8ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.