ETV Bharat / bharat

ఆ సమస్య తీరేవరకు నో హనీమూన్.. వాటర్ ట్యాంకర్​పై వధూవరుల ఊరేగింపు - మహారాష్ట్ర కొల్హపుర్ నీటి సమస్య

నీటి ఎద్దడిని మున్సిపల్ అధికారులకు తెలియజేసేందుకు ఓ కొత్త జంట వినూత్నంగా ఆలోచించింది. వాటర్​ ట్యాంక్​పై ఊరేగింపుగా వెళ్లి అవగాహన కల్పించేందుకు యత్నించింది. నీటి సమస్యను పరిష్కరించే వరకు హనీమూన్​కు వెళ్లమని నవ దంపతులు చెబుతున్నారు. అదెక్కడో.. అసలు ఈ కథేంటో ఓ సారి తెలుసుకుందామా.

water tank marriage procession
నీటి సమస్యను పరిష్కరించే వరకు హనీమూన్​కు వెళ్లమని ప్రకటించిన కొత్త జంట
author img

By

Published : Jul 9, 2022, 10:06 AM IST

వాటర్ ట్యాంకర్​పై ఊరేగుతున్న కొత్త జంట

నీటి సమస్యను మున్సిపల్ అధికారులకు తెలియజేసేందుకు ఓ కొత్త జంట వినూత్న నిరసన చేపట్టింది. అప్పుడే పెళ్లైన ఈ నవ దంపతులు.. వాటర్ ట్యాంకర్​పై ఊరేగింపుగా వెళ్లారు. నీటి సమస్య పరిష్కరించే వరకు హనీమూన్​కు వెళ్లమని వాటర్​ ట్యాంకర్​పై రాయించారు. వీరి వివాహానికి వచ్చిన బంధువులు ఖాళీ బిందెలు తలపై పెట్టుకుని డ్యాన్స్​లు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్​లోని ఖాసబాగాలో శుక్రవారం జరిగింది.

water tank marriage procession
నీటి సమస్యను పరిష్కరించే వరకు హనీమూన్​కు వెళ్లమని ప్రకటించిన కొత్త జంట

అసలు విషయం ఏంటంటే: కొల్హాపుర్‌కు చెందిన విశాల్ కొలేకర్, అపర్ణ సాలుంఖే వివాహం మంగళవారం జరిగింది. వీధుల్లో నీటి కొరత సమస్యపై ఈ పెళ్లిలో గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా పెళ్లైన తన భార్య నీటి సమస్యను ఎదుర్కోకూడదని ఇలా చేశానని అంటున్నాడు వరుడు విశాల్. అలాగే నీటి కోసం ఖాసబాగా వాసులు పడుతున్న కష్టాలను మున్సిపల్ అధికారులకు తెలియజేసేందుకే వాటర్ ట్యాంకర్​పై ఊరేగింపు నిర్వహించామని చెప్పాడు విశాల్.

water tank marriage procession
వాటర్​ ట్యాంకర్​పై నీటి బిందెలు

ట్యాంకర్ పక్కనే బంధువులు తలపై ఖాళీ బిందెలతో డ్యాన్స్​లు చేశారు. పెళ్లి బృందం ఊరేగింపు అర్ధరాత్రి వరకు జరిగింది. అనంతరం వీధుల్లోని ఇంటింటికి నవ దంపతులు ట్యాంకర్ పైపుతో నీటిని సరఫరా చేశారు.

ఇవీ చదవండి: బాయ్​ఫ్రెండ్​ దారుణ హత్య.. లైవ్​ వీడియో తీసిన మహిళ.. అసలు ట్విస్ట్​ అక్కడే..

పాక్ అమ్మాయి- భారత్​ అబ్బాయి.. సరిహద్దులు దాటి చిగురించిన ప్రేమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.