ETV Bharat / bharat

కేరళ ఎన్నికల్లో 'ట్వంటీ 20'

author img

By

Published : Mar 16, 2021, 9:46 AM IST

సాధారణంగా ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? రాజకీయ పార్టీల నాయకులే కదా. స్వతంత్ర అభ్యర్థులూ బరిలో దిగుతారనుకోండి. కేరళలోని ఎర్నాకుళం జిల్లా ఎన్నికలు మాత్రం అందుకు మినహాయింపు. అక్కడ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓ కార్పొరేట్‌ సంస్థ కూడా పోటీ చేస్తోంది.

corporate management participation in kerala polls
కేరళ ఎన్నికల్లో 'ట్వంటీ 20'

కేరళ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలు విసురుతోంది ఓ కార్పోరేట్ సంస్థ. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) విధానంలో భాగంగా ఏర్పాటుచేసిన ఓ విభాగం ద్వారా తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతోంది.

అన్నా కైటెక్స్‌ అనేది కేరళలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ. 2013 మేలో ఆ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా 'ట్వంటీ 20' పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఎర్నాకుళం జిల్లాలోని కిళక్కంబలం పంచాయతీని 2020లోగా దేశంలోకెల్లా అత్యుత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం ఆ విభాగం లక్ష్యమని దాని అవతరణ నాడు ప్రకటించారు. మన దేశంలో ఏర్పాటైన తొలి 'కార్పొరేట్‌ పంచాయతీ సంస్థ' అదే. అన్నా కైటెక్స్‌ అనుబంధ సంస్థ 'కైటెక్స్‌ గార్మెంట్స్‌' నియంత్రణలో 'ట్వంటీ 20' పనిచేస్తుంది. గార్మెంట్స్‌ మేనేజర్‌ సాబు ఎం జాకొబ్‌ ప్రస్తుతం ఆ విభాగానికి ప్రధాన సమన్వయకర్త. ఆయన్నే 'ట్వంటీ 20' స్థాపకుడిగా చెబుతుంటారు.

kerala
కేరళ

పంచాయతీలో ప్రగతి పరుగులు

అన్నా కైటెక్స్‌ గ్రూపులో దాదాపు 12,500 మంది ఉద్యోగులున్నారు. వారిలో అత్యధికులు.. కిళక్కంబలం పంచాయతీ చుట్టుపక్కల నివసిస్తున్నవారే. 2015లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 'ట్వంటీ 20' పోటీ చేయగా.. వారందరి మద్దతుతో అద్భుత ఫలితాలు సాధించింది. కిళక్కంబలం గ్రామ పంచాయతీలో మొత్తం 19 స్థానాలకుగాను 17 చోట్ల విజయ దుందుభి మోగించింది. అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. రోడ్లు నిర్మించింది. తాగునీరు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది. కిళక్కంబలం ప్రజలకు తాగునీరు, కూరగాయలు, కిరాణా సామాన్లను మార్కెట్‌ రేట్లతో పోలిస్తే సగం ధరలకే 'ట్వంటీ 20' అందిస్తోంది. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో అది మరింత మెరుగైన ఫలితాలను రాబట్టింది. కిళక్కంబలంలో అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసింది. పొరుగున ఉన్న కున్నథునాడ్‌, మళువన్నూర్‌ పంచాయతీలనూ గెల్చుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలిచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం అసెంబ్లీ పోరుకు సై అంటోంది 'ట్వంటీ 20'. ఇప్పటికే ఎర్నాకుళం జిల్లాలో 5 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది కూడా. మరో 9 స్థానాలకూ త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ఎంపికలో 'ట్వంటీ 20' ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ప్రతిపాదనల్లో ఉన్నవారికి జనామోదం ఉందో లేదో ముందే అధ్యయనం చేస్తోంది. ఇప్పటివరకు ఆ విభాగం ఖరారు చేసిన అభ్యర్థుల్లో ఒకరు దంత వైద్యుడు కాగా, మరొకరు విశ్రాంత ప్రొఫెసర్‌, ఇంకొకరు న్యాయ నిపుణుడు. అసెంబ్లీ ఎన్నికల్లో 'ట్వంటీ 20' అభ్యర్థులు గెలుస్తారా? ఓడతారా? అనే సంగతిని పక్కనపెడితే.. రాజకీయాల్లో ఆ కార్పొరేట్‌ విభాగం అడుగులు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

ఇదీ చదవండి:'అన్నాడీఎంకే మా మేనిఫెస్టోను కాపీ కొట్టింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.