ETV Bharat / bharat

'18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌'..అని కేంద్రం చెప్పినా..! - 17కోట్లమందికి పైగా కరోనా టీకా

రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయవచ్చని కేంద్రం నిర్ణయించింది. దీనిని మే 1 నుంచి అమల్లోకి తెచ్చింది. 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని కేంద్రం చెప్పినప్పటికీ, వ్యాక్సిన్‌ల కొరత కారణంగా చాలా రాష్ట్రాలు దీనిని ఆచరణలోకి తీసుకురాలేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లోనూ అమలు సాధ్యపడలేదు.

Corona
కరోనా టీకా
author img

By

Published : May 13, 2021, 10:45 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే రెండో దశ వ్యాప్తిలో యువతీయువకులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయవచ్చని కేంద్రం నిర్ణయించింది. దీనిని మే 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే, దేశ వ్యాప్తంగా 45 ఏళ్లలోపు వారు ఇప్పటి వరకు 34,80,618 మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీరందరికీ ఇంకా రెండో డోస్‌ వేయాల్సి ఉంది.

18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని కేంద్రం చెప్పినప్పటికీ, వ్యాక్సిన్‌ల కొరత కారణంగా చాలా రాష్ట్రాలు దీనిని ఆచరణలోకి తీసుకురాలేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లోనూ అమలు సాధ్యపడలేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దాదాపు అన్ని రాష్ట్ర్రాలూ 45 ఏళ్లు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో యువతీ యువకులు వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నా అది అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. కొన్నిచోట్ల ప్రైవేటుగా వ్యాక్సిన్‌లు వేస్తున్నప్పటికీ అక్కడ కూడా వ్యాక్సిన్ల లభ్యత అంతంతమాత్రమే.

తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 17,72,14,256 మంది కరోనాటీకా వేయించుకున్నారు. వీరిలో ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారో పరిశీలిస్తే..!

  • ఆరోగ్య సిబ్బంది ( మొదటి డోసు)- 96,00,420
  • ఆరోగ్యసిబ్బంది (రెండో డోసు) - 65,70,062
  • ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ (మొదటి డోసు) - 1,42,34,793
  • 45 నుంచి 60 ఏళ్ల లోపు వారు ( మొదటి డోసు) -5,62,43,308
  • 45 నుంచి 60 ఏళ్లలోపు వారు (రెండో డోసు) - 81,58,535
  • 60 ఏళ్లు దాటిన వారు ( మొదటి డోసు) - 5,40,99,241
  • 60 ఏళ్లు దాటిన వారు ( రెండో డోసు) - 1,67,97,272
  • 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు ( మొదటి డోసు) - 34,80,618

ఇదీ చదవండి: దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.