ETV Bharat / bharat

రెండు, మూడు ఉత్పరివర్తనలున్నా టీకాకు ఢోకాలేదు! - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జినోమిక్స్‌

కరోనా వైరస్​ రోజుకో కొత్త రూపు దాలుస్తుందంటూ వెలువడుతున్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఒక్కో రకానికి ఒక్కో టీకా తీసుకోవాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు రెండు, మూడు ఉత్పరివర్తనలున్న వైరస్​లపై సమర్థంగానే పనిచేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు ఒక్క వైరస్‌లోనే ఆ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జినోమిక్స్‌ డైరెక్టర్‌ సౌమిత్ర దాస్‌ వెల్లడించారు.

vaccine
కరోనా టీకా
author img

By

Published : Apr 24, 2021, 7:35 AM IST

భారత్‌లో వెలుగుచూస్తున్న రెండు, మూడు ఉత్పరివర్తనలతో కూడిన కరోనా వైరస్‌ గురించి ఆందోళన అవసరం లేదని నిపుణులు తెలిపారు. అవన్నీ ఒక వైరస్‌ రకానికి చెందినవేనని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జినోమిక్స్‌ డైరెక్టర్‌ సౌమిత్ర దాస్‌ పేర్కొన్నారు. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ.. దేశంలోని కరోనా వైరస్‌ జన్యుక్రమాలను ఆవిష్కరిస్తోంది.

"అవి బి.1.617 రకానికి చెందినవే. వాటిని సందర్భాన్ని బట్టి రెండు, మూడు ఉత్పరివర్తన రకాలుగా పేర్కొంటున్నారు. బి.1.617లో ఈ484క్యూ, ఎల్‌452ఆర్‌ అనే రెండు రకాల మార్పులు.. యాంటీబాడీలతో వైరస్‌ను నిర్వీర్యం చేసే విధానంలో ముఖ్య పాత్ర పోషించే భాగంపై ఉన్నాయి. ఆ అంశానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మేం రెండు ఉత్పరివర్తనలుగానే ఆ రకాన్ని అభివర్ణించాం. అయితే ఆ వైరస్‌లో పి681ఆర్‌ అనే మరో ఉత్పరివర్తన కూడా ఉంది. దీనివల్ల ఈ వైరస్‌.. మానవ కణంలో మెరుగ్గా ప్రవేశించగలుగుతుంది. వైరస్‌లోని ఏ గుణాన్ని ప్రస్తావిస్తున్నామన్న అంశం ఆధారంగా దాన్ని రెండు, మూడు ఉత్పరివర్తనలతో కూడిన రకంగా అభివర్ణించాం."

-సౌమిత్ర దాస్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జినోమిక్స్‌ డైరెక్టర్

ఈ ఉత్పరివర్తనల వల్ల ఇన్‌ఫెక్షన్‌ రేటు పెరిగి, టీకాల సమర్థత తగ్గుతుందన్న ఆందోళనలు కొందరిలో ఉన్నాయి. అయితే భారత్‌లో వెలుగు చూసిన కరోనా రకాలు.. టీకాలను ఏమారుస్తున్నట్లు ఎక్కడా రుజువు కాలేదని సౌమిత్ర దాస్‌ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వాటిపై సమర్థంగానే పనిచేస్తాయని చెప్పారు.

ఇవీ చదవండి: 'ప్రాణాలు పోతున్నా ఆక్సిజన్​ ఉత్పత్తి చేయరా?'

'మహా' విలయం- ఒక్కరోజే 66,836 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.