Covid Cases India: దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య రెండు వేల దిగువకు పరిమితమైంది. కొత్తగా 1,549 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,652 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు: 4,30,09,390
- మొత్తం మరణాలు: 5,16,510
- యాక్టివ్ కేసులు: 25,106
- కోలుకున్నవారు: 4,24,67,774
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఆదివారం మరో 2,97,285 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,24,97,303కు పెరిగింది.
Covid Tests:
దేశంలో ఆదివారం 3,84,499 కరోనా టెస్టులు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే..
భారత్లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పలు దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అన్ని దేశాల్లో కలిపి ఆదివారం 11,16,812 కొత్త కేసులు వెలుగుచూశాయి. 2,907 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 47,10,79,926కు చేరగా.. మృతుల సంఖ్య 61,01,021కు పెరిగింది.
కరోనా కొత్త కేసుల ప్రభావం దక్షిణ కొరియాలో అత్యంత తీవ్రంగా ఉంది. అక్కడ ఒక్కరోజే 3,34,708 కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాలు మాత్రం సల్వంగా 327 ఉండటం ఊరటనిస్తోంది.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలు
దేశం | కొత్త కేసులు | కొత్త మరణాలు | మొత్తం కేసులు | మొత్తం మరణాలు | |
1 | దక్షిణ కొరియా | 3,34,708 | 327 | 93,73,646 | 12,428 |
2 | వియత్నాం | 1,41,151 | 63 | 79,58,048 | 41,880 |
3 | జర్మనీ | 90,525 | 24 | 1,86,83,287 | 1,27,432 |
4 | ఫ్రాన్స్ | 81,283 | 30 | 2,41,37,160 | 1,40,933 |
5 | ఇటలీ | 60,415 | 93 | 13,861,743 | 1,57,785 |
ఇదీ చదవండి: ఏ సీఎం స్థానం ఎవరికి? ప్రభుత్వాల ఏర్పాటుపై మోదీ సమీక్ష