దేశంలో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. దిల్లీలో తాజాగా 2,260 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 14,15,219కి చేరింది. ఇది గత 50 రోజుల్లో అత్యల్పం. వైరస్ బారిన పడి కొత్తగా 182 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 23,013కి చేరింది.
- తమిళనాడులో 35,873 కేసులు బయటపడ్డాయి. 448 మంది వ్యాధి సోకి మరణించారు.
- కర్ణాటకలో 31,183 కొత్త కేసులు నమోదయ్యాయి. 451 మంది మృతి చెందారు.
- బంగాల్లో 18,863 కేసులు బయటపడ్డాయి. 154 మంది మరణించారు.
- ఉత్తర్ప్రదేశ్లో 6,046 కేసులు వెలుగులోకి వచ్చాయి. 226 మంది మరణించారు. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రస్తుతం ఉన్న కరోనా కర్ఫ్యూను మే 31 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- కేరళలో 28,514 కేసులు వెలుగులోకి వచ్చాయి. 176 మంది వ్యాధి బారిన పడి మరణించారు.
- మధ్యప్రదేశ్లో 3,844 మంది వ్యాధి బారిన పడ్డారు. 89 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: కరోనాతో భర్త మరణం- గర్భిణీ భార్య ఆత్మహత్య